Top Highest Gross South Indian Movies : ఒకప్పుడు భారతీయ సినిమా అంటే హిందీలో వచ్చే సినిమాల గురించే చెప్పుకునేవారు. ఇక బాలీవుడ్ వాళ్లు ఎప్పటి నుంచో సౌత్ సూపర్ హిట్ కథలను అక్కడ రీమేక్ చేసి మంచి సక్సెస్లు అందుకున్నారు. అటు బాలీవుడ్లో హిట్టైన కొన్ని సినిమాలను మన వాళ్లు రీమేక్ చేసిన సందర్భాలున్నాయి. ఇక దక్షిణాది నుంచి చాలా మంది దర్శకులు బాలీవుడ్లో సినిమాలు డైరెక్ట్ చేసి హిట్స్ అందుకున్నారు. కానీ రాజమౌళి తీసినా బాహుబలి సినిమాతో దక్షిణాది సినిమా సరిహద్దులు చెరిపేసుకుంది. ఇక ఆ తర్వాత ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలు రూ. 1200 కోట్లను క్రాస్ చేసి సంచలనం రేపాయి. ఈ నేపథ్యంలో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన టాప్ సౌత్ ఇండియా సినిమాలు ఏవో చూద్దాం.. Photo : Twitter
బాహుబలి2 : Bahubali 2 : 1810 కోట్లు వసూలు.. ప్రభాస్, అనుష్క శెట్టి, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. రాజమౌళి దర్శకుడు. భారతీయ బాక్సాఫీస్ దగ్గర రెండో అతిపెద్ద విజయంగా నిలిచింది. కానీ మన దేశ బాక్సాఫీస్ విషయానికొస్తే.. ఇప్పటికే బాహుబలి 2 టాప్లో ఉంది. 2017లో విడుదలైన బాహుబలి 2 అప్పటి వరకు ఉన్న భారతీయ సినిమా రికార్డులను తిరగరాసింది. Photo : Twitter
KGF చాప్టర్ 2 : KGF Chapter 2 : 1233 కోట్లు వసూలు.. యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రశాంత్ నీల్ దర్శకుడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 1233 కోట్లతో భారతీయ బాక్సాఫీస్ దగ్గర టాప్ 3లో నిలిచింది. సౌత్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర రెండో ప్లేస్లో ఉంది. Photo : Twitter
RRRమూవీ : RRR Movie : 1164.50 కోట్లు వసూలు.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. రాజమౌళి దర్శకుడు. Photo : Twitter
2పాయింట్0 : 2Point0 : 709 కోట్లు వసూలు.. రజనీకాంత్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు.. శంకర్ దర్శకత్వం వహించారు. Photo : Twitter
బాహుబలి : Bahubali 1 : 605 కోట్లు వసూలు.. ప్రభాస్, అనుష్క శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. Photo : Twitter
పొన్నియన్ సెల్వన్1 : Ponniyin Selvan 1 : 487.50 కోట్లు వసూలు.. విక్రమ్, జయం రవి, కార్తీ నటించారు. మణిరత్నం దర్శకత్వం వహించారు. Photo : Twitter
సాహో : SAAHO : 435 కోట్లు వసూలు.. ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. సుజీత్ దర్శకుడు. Photo : Twitter
విక్రమ్ : Vikram : 417.10 కోట్లు వసూలు.. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో నటించారు. లోకేష్ కనగరాజ్ దర్శకుడు. Photo : Twitter
కాంతార : Kantara : 390 కోట్ల వసూలు.. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ ప్రధాన పాత్రల్లో నటించారు. రిషబ్ శెట్టి దర్శకుడు. Photo : Twitter
పుష్ప : PUSHPA : 360 కోట్లు వసూలు.. అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. సుకుమార్ దర్శకత్వం వహించారు. Photo : Twitter