ఒకప్పుడు ఓటిటి అంటే కేవలం టీవీ తెరగానే చూసేవాళ్లు. అక్కడ కొందరు చిన్న హీరో హీరోయిన్లు మాత్రమే నటిస్తారు.. లేదంటే అవకాశాలు లేనివాళ్లే అక్కడ కనిపిస్తారు అనే అపోహలు ఉండేవి. కానీ కాలం మారిపోయింది. అందుకే ఇప్పుడు ఓటిటి రేంజ్ కూడా మారిపోయింది. నందమూరి బాలకృష్ణ లాంటి హీరోలు కూడా ఇప్పుడు ఓటిటిలోకి అన్‌స్టాపబుల్ అంటూ వచ్చి నిజంగా అన్‌స్టాపబుల్ అనిపంచారు. ఇదే కోవలో చాలా మంది ఓటీటీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తెలుగులో చాలా మంది హీరో హీరోయిన్లు డిజిటల్ మీడియాలోకి అడుగు పెట్టారు. సమంత, తమన్నా, కాజల్, శృతి హాసన్ లాంటి వాళ్లు ఓటిటిలో అదరగొట్టారు. అలా కొన్నేళ్లుగా ఓటిటిలో సూపర్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లు ఎవరో చూద్దాం..
1. సమంత: ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత సమంత రేంజ్ మారిపోయింది. దెబ్బకు హిందీ నుంచి కూడా ఇప్పుడు అవకాశాలు మొదలయ్యాయి. అక్కడ కూడా బిజీ అయింది సమంత. ఇపుడు ఏకంగా ఇంటర్నేషనల్ మూవీస్‌లో నటిస్తోంది.
2. తమన్నా భాటియా: గతేడాది నవంబర్ స్టోరీతో డిజిటల్ మీడియాలో సత్తా చూపించింది తమన్నా. సిరీస్‌కు అనుకున్న రెస్పాన్స్ అయితే రాలేదు కానీ తమన్నా నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
3. కాజల్ అగర్వాల్: వెంకట్ ప్రభు తెరకెక్కించిన లైవ్ టెలికాస్ట్ వెబ్ సిరీస్‌తో డిజిటల్ మీడియాలోకి అడుగు పెట్టింది కాజల్. ఇది బాగానే వ్యూస్ తెచ్చుకుంది.రీసెంట్గా కాజల్ ఒక బాబుకు తల్లైన సంగతి తెలిసిందే కదా.
4. శృతి హాసన్: తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ వెబ్ సిరీస్‌లు చేస్తుంది శృతి హాసన్. ఇప్పటికే పిట్ట కథలు, పావ కదైగల్తో గుర్తింపు తెచ్చుకుంది. మొన్నటికి మొన్న బెస్ట్ సెల్లర్ అనే వెబ్ సిరీస్‌లోనూ నటించింది.
5. నిత్యా మీనన్: బ్రీత్ 2లో అదిరిపోయే హాట్ సీన్స్ కూడా చేసింది నిత్యా మీనన్. దాంతో హిందీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అభిషేక్ బచ్చన్ ఇందులో మెయిన్ లీడ్‌లో నటించాడు.
6. ప్రియమణి: ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌తో ప్రియమణి బాలీవుడ్‌లోనూ అదిరిపోయే క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు అక్కడ వరసగా వెబ్ సిరీస్‌లు చేస్తుంది. ఇపుడు మళ్లీ సినిమాలతో ఫుల్ బిజీగా మారింది.
7. కియారా అద్వానీ: లస్ట్ స్టోరీస్ మామూలు సంచలనం సృష్టించలేదు. ఈ ఒక్క వెబ్ సిరీస్ తర్వాత కియారా పేరు ఇండియన్ వైడ్‌గా మార్మోగిపోయింది. ఆ తర్వాత తెలుగులో భరత్ అను నేను, వినయ విధేయ రామ సినిమాలతో పాటు మళ్లీ రామ్ చరణ్, శంకర్ సినిమాల్లో నటించింది.
8. శోభితా ధూళిపాళ: మేడిన్ హెవెన్‌తో పాటు మరికొన్ని వెబ్ సిరీస్‌లతో శోభిత అక్కడ బిజీ అయిపోయింది. తాజాగా మళ్లీ మేజర్ మూవీతో మరోసారి వెండితెర ప్రేక్షకులను పలకరించింది.
9. సుష్మితా సేన్: ఒకప్పుడు సినిమాలతొో రప్ఫాడించిన సుష్మితా సేన్.. ఇప్పుడు డిజిటల్ స్టార్ అయిపోయింది. అక్కడ ఆర్య, ఆర్య 2 లాంటి సిరీస్‌లు ఈమెకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ తీసుకొచ్చాయి.
10. అజీబ్ దస్తాన్స్: అదితి రావు హైదరీ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ చాలా బిజీ అయిపోయింది. ప్రస్తుతం రెండు చోట్ల రఫ్పాడిస్తోంది.
11. హుమా ఖురేషీ: మహారాణి అనుకున్న స్థాయిలో సక్సెస్ అయితే కాలేదు కానీ రాణి ముఖర్జీకి మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత వరసగా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో నటిస్తుంది రాణి.
12. ఈషా రెబ్బా: పిట్ట కథలు వెబ్ సిరీస్ తర్వాత మొన్నటికి మొన్న ఆహాలో మరో వెబ్ సిరీస్ కూడా చేసింది. 3 రోజెస్ పేరుతో వచ్చిన ఈ సిరీస్‌లో హాట్‌గా రెచ్చిపోయింది ఇషా రెబ్బా.
13. సాయి పల్లవి: సినిమాల్లో ఎంత క్రేజ్ ఉన్నా.. అప్పుడప్పుపుడూ వెబ్ సిరీస్‌ల వైపు కూడా చూస్తుంది సాయి పల్లవి. పావ కథైగల్ సిరీస్‌తో నటిగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది పల్లవి.
14. అంజలి: పావ కథైగల్ వెబ్ సిరీస్‌లోనే మరో కథలో అంజలి నటించింది. ఈ ఎపిసోడ్లో ఈమె కల్కి కొచ్లిన్‌తో కలిసి అదిరిపోయే సీన్స్ చేసింది.
15. అమలా పాల్: పిట్ట కథలు సిరీస్‌తో బాగానే గుర్తింపు తెచ్చుకుంది అమలా పాల్. ఆ తర్వాత హిందీలో కూడా ఈమె పలు వెబ్ సిరీస్‌లు చేసింది.