టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. లేటెస్ట్ గా ఈ భామ యశోద సినిమాాతో హిట్ కొట్టింది. అయితే సమంత ఇప్పుడు మరో సారి తన సత్తా చాటింది. తాజాగా ఆర్మాక్స్ మీడియా నిర్వహించిన సర్వేలో ... ప్రముఖ హీరోయిన్లందరిని సమంత వెనక్కి నెట్టి సామ్ టాప్‌లో నిలిచింది.
ఇక బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆలియా భట్.. ఈ సర్వేలో రెండో స్థానంలో నిలిచింది. స్టార్ కిడ్ అయిన ఆలియా భట్ ... తనదైన స్టైల్లో సినిమాలు తీసుకుంటూ పాపులారిటీ సంపాదించుకుంది. ఇటీవలే బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ను పెళ్లాడింది.ఈ స్టార్ కపుల్ పండటి ఆడబిడ్డకు తల్లిదండ్రులుగా కూడా ప్రమోషన్ పొందారు.
సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నయన్... తెలుగు, తమిళ్, కన్నడ, యలయాళం సినిమాల్లో నటించి మెప్పించిన నయన్.. ఆర్మాక్స్ సర్వేలో థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. నయన్ ఈ ఏడాదే.. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు విఘ్నేశ్ శివనను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. గురించి పరిచయం అవసరం లేదు.ఈ భామ పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నా కూడా వన్నె తగ్గని అందంతో అందర్నీ ఆకట్టుకుంటుంది.అందుకే కాజల్ తాజాగా చేసిన సర్వేలో నాలుగో స్థానం దక్కించుకుంది.మరోవైపు సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆరంభించింది కాజల్.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకొణె షారుఖ్ ఖాన్ తో కలిసి ఓం శాంతి ఓం సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దీపికా ఆర్మాక్స్ మీడియా సర్వేలో ఐదో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం షారుక్ తో కలిసి దీపికా పటాన్ సినిమాలో నటిస్తుంది అటు తెలుగులో ప్రభాస్ సరసన ప్రాజెక్ట్ కేలో నటిస్తోంది ఈ భామ.
నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్. ఈ భామ పుష్ప సినిమాతో ఎక్కడ లేని క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు బాలీవుడ్లో కూడా రష్మిక ఫుల్ బిజీగా మారింది. రష్మిక ఈ సర్వేలో ఆరవ స్థానంలో నిలిచింది. Rashmika Mandanna Instagram
బాలీవుడ్ కేట్... కత్రిన కైఫ్... పెళ్లైనా కూడా గ్లామర్ మెంటైన్ చేస్తూ... అభిమానుల మతులు పోగుడుతుంది. తాజాగా ఈ భామ ఆర్మాక్స్ మీడియా సర్వేలో ఏడో స్థానం దక్కించుకుంది. బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్‌ను కత్రినా కైఫ్ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం కైఫ్ ఫోన్ బూత్ సినిమాలో నటిస్తోంది.
టాలీవుడ్ అందాల భామ అనుష్క శెట్టి, ఈ అమ్మడు ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించకపోయినా.. ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. అనుష్క.. తాజా మీడియా సర్వేలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. అనుష్క యంగ్ హీరో నవీన్ పొలిశెట్టితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
మహానటితో అందరి మనసులు గెలుచుకున్న భామ కీర్తి సురేష్. ఈ అమ్మడు.. తాజాగా సర్కారు వారి పాట సినిమాతో సక్సెస్ అందుకుంది. కీర్తి సురేష్ ఆర్మాక్స్ మీడియా సర్వేలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం కీర్తి.. నేచురల్ స్టార్ నానితో కలిసి దసరా సినిమాలో నటిస్తోంది.
త్రిష.. ఈ అమ్మడు వయసు 39 ఏళ్లు. అయనా వన్నె తగ్గని అందంతో అభిమానుల్ని ఆకట్టుకుంటూనే ఉంది. త్రిష లేటెస్ట్గా మణిశర్మ పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించింది. త్రిష అందానికి అంతా ఫిదా అయ్యారు. తాజాగా త్రిష ఆర్మాక్స్ మీడియా సర్వేలో పదో స్థానంలో నిలిచింది. త్రిష తర్వాత తమన్నా భాటియా, కృతి శెట్టి, అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు.