Top 10 TRP Rating Movies : ఒకప్పుడు స్మాల్ స్క్రీన్ పై కొత్త సినిమా వస్తుందంటే సందడి మామూలుగా ఉండేది కాదు. ఎందుకంటే అప్పట్లో ఓటిటిలు లేవు.అప్పట్లో విడుదలైన బడా హీరోల సినిమాలు చాలా నెల తర్వాత పండగ వంటి రోజుల్లో ప్రసారం చేసేవారు. పైగా అప్పట్లో ప్రేక్షకుల చేతికి ఒరిజినల్ ప్రింట్ అంత తేలిగ్గా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు.. ఎలాంటి సినిమా అయినా.. ఎంత పెద్ద హీరో అయినా నెల రోజుల్లోనే ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. టీవీలో వచ్చే వరకు కూడా సినిమాను చూడకుండా ఆగడం లేదు ప్రేక్షకులు. Photo : Twitter
1. Ala Vaikunthapurramuloo.. అల వైకుంఠపురములో: 2016లో బార్క్ ప్రవేశపెట్టిన తర్వాత అత్యధిక టిఆర్పీ తీసుకొచ్చిన సినిమా ఇదే. త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కు మొదటిసారి టీవీలో ఏకంగా 29.4 రేటింగ్ వచ్చింది. ఇప్పటి వరకు టాప్ రేటింగ్ అయితే ఇదే. దీన్ని బీట్ చేసే సినిమా రెండేళ్లుగా రాలేదు. Photo : Twitter
2. సరిలేరు నీకెవ్వరు: 2020 సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో పాటు విడుదలైన సినిమా సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు నటించిన ఈ చిత్రం కూడా రూ. 120 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అలాగే టీవీలోనూ సత్తా చూపించింది. దీనికి 23.5 రేటింగ్ వచ్చింది. Photo : Twitter
3. బాహుబలి 2: Bahubali 2: The Conclusion.. ఐదేళ్ల కింద విడుదలైన బాహుబలి 2 అప్పట్లో సంచలనం రేపింది. టీవీలో మొదటిసారి వచ్చినపుడు ఎక్కువగానే ఊహించినా.. అప్పటికే థియేటర్స్‌లో చూడటంతో టీవీలో తక్కువ రేటింగ్ వచ్చింది. దీనికి 22.7 టిఆర్పీ మాత్రమే వచ్చింది. Photo : Twitter
4. శ్రీమంతుడు: Srimanthudu .. విచిత్రంగా శ్రీమంతుడు సినిమాకు ఎన్నిసార్లు టీవీలో వేసినా కూడా మంచి రేటింగ్ వస్తుంది. ఈ సినిమాకు ఆ మధ్య 22.54 రేటింగ్ వచ్చింది. అది కూడా మొదటిసారి కాదు.. రెండు మూడు సార్లు టీవీలో వచ్చిన తర్వాత కూడా ఆడియన్స్ ఈ సినిమాను బాగానే చూస్తున్నారు. Photo : Twitter
5. పుష్ప : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలైన మూడు వారాలకే ఓటిటిలో వచ్చేసింది. దాంతో టీవీలో వచ్చినా పెద్దగా ఫలితం చూపించలేదు. కేవలం 22.54 రేటింగ్తోనే సరిపెట్టుకుంది ఈ చిత్రం. Photo : Twitter
6. డిజే: అల్లు అర్జున్ నటించిన మరో సినిమా డిజే టిఆర్పీ కూడా టాప్ 10లో ఉంది. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ టీవీలో బాగానే ఆడింది. దీనికి 21.7 రేటింగ్ వచ్చింది. Photo : Twitter
7. బాహుబలి : రాజమౌళి మ్యాగ్నమ్ ఓపస్ బాహుబలి సినిమాకు అప్పట్లో రికార్డు టిఆర్పీ వచ్చింది. థియేటర్స్‌లో అంత పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా దీనికి టీవీలో 21.54 రేటింగ్ వచ్చింది. Photo : Twitter
8. ఫిదా: సాయి పల్లవి, వరుణ్ తేజ్ జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ఫిదా. దీనికి టీవీలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా సాయి పల్లవి నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. అందుకే టిఆర్పీ కూడా అలాగే వస్తుంది. ఈ సినిమాకు 21.31 రేటింగ్ వచ్చింది. Photo : Twitter
9. గీత గోవిందం : విజయ్ దేవరకొండ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ గీత గోవిందం సినిమాకు మంచి అప్లాజ్తో పాటు టిఆర్పీ రేటింగ్స్ కూడా వచ్చాయి. కుటుంబ కథా చిత్రం కావడంతో దీనికి 20.8 రేటింగ్ వచ్చింది. టాప్ 9లో ఉంది ఈ చిత్రం. Photo : Twitter
10. జనతా గ్యారేజ్: జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా 2016లో విడుదలైన మంచి విజయం సాధించింది. ఈ సినిమాకు టీవీలోనూ ఆదరణ బాగానే దక్కింది. మొదటిసారి వేసినపుడు 20.69 రేటింగ్ వచ్చింది. Photo : Twitter
11. ఆర్ఆర్ఆర్ (RRR) : రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా ఆర్ఆర్ఆర్ మూవీ తొలిసారిగా 19.62 రేటింగ్ సాధించింది. ఇది ఒక రకంగా తక్కువే అయినా.. ఇప్పటికే ఈ సినిమా చాలా మంది థియేటర్స్‌తో పాటు ఓటీటీ వేదికలైన జీ 5, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్‌లో చూసేసారు. దాదాపు థియేటర్, ఓటీటీల్లో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ రోజుల్లో ఈ మాత్రం టీఆర్పీ సాధించడం అంటే అది మాములు విషయం కాదు. Photo : Twitter