కరోనా కారణంగా గత రెండేళ్లు సినీ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యింది. అయితే ఈ ఏడాది పరిస్థితులు బాగుండటంతో తిరిగి జనం సినిమాలు చూసేందుకు ధియేటర్లకు రావడం మొదలు పెట్టారు. అయితే ఈ క్రమంలో కొన్ని సినిమాలో ఓటీటీలో విడుదలై తమ సత్తా చూపెట్టాయి. ఈ ఏడాది ప్రముఖ ఓటీటీ ప్లాట ఫాం అమెజాన్ ప్రైమ్‌లో కొన్ని సినిమాలు టాప్ లిస్టులు చేరాయి.
ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాల సినిమాలు ఈ ఏడాది జోరుమీదున్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఈ ఏడాది దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఈ సినిమాలో బన్నీ ఊర మాస్ ఫెర్ఫామెన్స్‌కు అభిమానులంతా ఫిదా అయ్యారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఎక్కువమంది చూసిన సినిమాల్లో టాప్ 1గా నిలిచింది.
పుష్ప తర్వాత ఆ క్రెడిట్ కేజీఎఫ్ చాఫ్టర్ 1కు దక్కింది. కన్నడ హీరో యష్ నటించిన ఈ మూవీ... పాన్ ఇండియాగా పాపులారిటీ దక్కించుకుంది. ఈ సినిమాను కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన కేజీఎఫ్.. ప్రైమ్‌లో కూడా ఎక్కువమంది వీక్షించిన సినిమాల్లో రెండో స్థానంలో నిలిచింది.
కేజీఎఫ్‌కు సీక్వెల్‌గా వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా కూడా అంతే బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక కేజీఎఫ్ 2ను మిస్ చేసిన వారు.. మళ్లీ మళ్లీ చూడాలనుకున్నావారు ఓటీటీలో స్ట్రీమింగ్కు రాగానే.. టీవీలకు అతుక్కుపోయారు. ఈ సినిమా ప్రైమ్ ఓటీటీలో టాప్ త్రి ప్లేసులో నిలిచింది. కేజీఎఫ్ సిరీస్ కన్నడ స్టార్ హీరో యష్‌కు ఫుల్ పాపులారిటీ తెచ్చి పెట్టింది.
సీతారామం.. ఈ పేరు ఎంత బావుంటుందో.. ఈ సినిమా కూడా అంతే కమ్మగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదనే చెప్పాలి. యుద్ధంతో రాసిన ప్రేమకథగా ప్రేక్షకులకు వచ్చిన సీతారామం అందరి మనసులని గెలుచుకుంది. ఇక ఓటీటీలో కూడా సీతారామం బాగానే రేటింగ్ తెచ్చుకుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఎక్కువమంది చూసిన సినిమాల్లో సీతారామం సినిమా నాలుగో స్థానంలో నిలిచింది.
పొన్నియన్ సెల్వన్... పార్ట్ వన్ ప్రముఖ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని తెరకెక్కించారు. ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవితో పాటు ఐశ్వర్య రాయ్, త్రిష వంటి భారీ తారాగణంతో ఈ సినిమాను తీశారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ఐదవ స్థానంలో నిలిచింది. ఏప్రిల్ 30న విడుదలైన ఈ సినిమా కోలీవుడ్‌లో మాత్రం మంచి కలెక్షన్లు సాధించింది. తెలుగు ఆడియన్స్’ను మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.
టాప్ 5లో మన సౌత్ సినిమాలు నిలిచాయి. ఆ తర్వాత బాలీవుడ్ మూవీలు ప్రైమ్ లో మెరిసాయి. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బచ్చన్ పాండే. ఈ సినిమా అక్షయ్ కుమార్... తెలుగులో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ సినిమానే రిమేక్ చేశారు. ఈ సినిమా హిందీ ఆడియన్స్‌ను బాగానే ఆకట్టుకుంది. ఇక ప్రైమ్‌లో ఎక్కువమంది చూసిన సినిమాల్లో బచ్చన్ పాండే సినిమా టాప్ 6లో నిలిచింది.
కియారా అద్వానీ, వరుణ్ ధావన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా జుగ్ జుగ్ జియో. ఈ సినిమలో అనీల్ కపూర్ కూడా నటించారు. భార్య భర్తలు, గొడవలు ఇలా ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్‌లో టాప్ 7 ప్లేస్‌లో నిలిచింది.
ఇక ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ నటించిన సినిమా రన్‌వే 34,. ఈ సినిమాలో అజయ్ ఓ పైలట్‌గా నటించారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటించింది. పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై అజయ్ దేవ్‌గణ్ నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు మొదట 'మేడే' గా ప్రకటించి అనంతరం 'రన్‌వే 34'గా పేరు మార్చారు. అమితాబ్ బచ్చన్ కూడా మరొ లీడ్ రోల్ చేశారు. ఈ సినిమా ప్రైమ్’లో టాప్ 8 ప్లేస్ దక్కించుకుంది.