యశోద.. : Yashoda: సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాను హరి, హరీష్‌లు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంతతో పాటు ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్‌కుమార్, రావు రమేష్‌లు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు.
సంసారం - సంతానం : Samsaram Santhanam : శోభన్ బాబు, జయసుద, సీమ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా 1981లో విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో అద్దెగర్భం కాన్సెప్ట్‌తో వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది. వి.మధుసూదనరావు దర్శకుడు. తమిళ రచయిత శివశంకరి వ్రాసిన ఒరు సింగం ముయలాగిరతు అనే నవల ఆధారంగా నిర్మించారు.
జాబిలమ్మ పెళ్లి : Jabilamma Pelli : ఈసినిమా కూడా సరోగసి కాన్సెప్ట్‌తో వచ్చింది. జగపతి బాబు, రుచిత ప్రసాద్, మహేశ్వరీ ప్రధాన పాత్రల్లో నటించారు. కొదండ రామిరెడ్డి దర్శకుడు. ఈ సినిమా 1996లో విడుదలైంది. లక్ష్మీ శ్రీనివాస ఆర్ట్ ఫిల్మ్స్ బ్యానర్‌పై బాబు S. S. బూరుగుపల్లి నిర్మించారు. M. M. కీరవాణి సమకూర్చారు.
9 నెలలు : 9 Nelalu : క్రాంతి కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2001లో విడుదలైంది. తీవ్రంగా గాయపడిన తన భర్తను రక్షించడానికి ఒక ధనవంతుల జంటకు సర్రోగేట్‌గా ఉండటానికి హీరోయిన్ అంగీకరిస్తుంది. ఈ చిత్రంలో సౌందర్య, విక్రమ్ నటించారు. దర్శకుడు ఈ చిత్రాన్ని 15 రోజుల్లో తీశాడు.
మిమీ : Mimi : కృతి సనన్, పంకజ్ త్రిపాఠి లీడ్ రోల్స్‌లో నటించారు. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కూడా కృత్రిమ గర్భధారణ చర్చిస్తారు. కృతి సనన్ (మిమి) విదేశీ జంటకు సరోగేట్‌గా చేసింది. ఈ సినిమా 2021లో విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.
ఐ యామ్ : I Am : ఒనిర్ దర్శకత్వం వహించారు. ఐ యామ్‌లో, సరోగసీ అంశంపై చర్చించారు. నందితా దాస్, పురబ్ కోహ్లీ ప్రధాన పాత్రల్లో నటించారు.
ఫిల్హాల్ : Filhaal : మేఘనా గుల్జార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2002లో వచ్చింది. టబు, సుస్మితా సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. మేఘనా గుల్జార్‌కు ఈ సినిమా మొదటిది. ఈ మూవీలో సుస్మితా సేన్, టబు బిడ్డకు సరోగేట్ మదర్‌గా నటించింది.
చోరీ చోరీ చుప్కే చుప్కే.. : Chori Chori Chupke Chupke : హిందీలో వచ్చిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించారు. సరోగసి పద్ధతిలో సల్మాన్ బిడ్డకు జన్మనిచ్చే తల్లి క్యారెక్టర్లో ప్రీతి జింటా అదరగొట్టింది. ఈ సినిమాకు అబ్బాస్ - మస్తాన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2001లో విడుదలై మంచి విజయాన్నిఅందుకుంది.
దూస్రీ దుల్హన్ : Doosri Dulhan : షబానా అజ్మీ, షర్మిలా ఠాగూర్, విక్టర్ బెనర్జీ నటించిన ఈ సినిమా 1983లో విడుదలైంది. పిల్లలు లేని జంట ఒక సెక్స్ వర్కర్ని నియమించుకుంటారు. లేఖ్ టాండన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి సంగీతం బప్పి లహిరి స్వరాలు సమకుర్చారు. ఈ చిత్రం పిల్లలు లేని జంట అనిల్ & రేణు ( విక్టర్ బెనర్జీ & షర్మిలా ఠాగూర్) అద్దె తల్లిగా చందా (షబానా అజ్మీ) నటించారు.