తెలుగు ఇండస్ట్రీలో కాజల్ అగర్వాల్ కు ఉన్న క్రేజ్ గురించి ఏం చెప్పాలి..? పెళ్లి తర్వాత కూడా ఈమె కావాలంటున్నారు దర్శక నిర్మాతలు. గౌతమ్ కిచ్లును గతేడాది పెళ్లి చేసుకున్న చందమామ.. ఇప్పటికీ బిజీగానే ఉంది. వరస సినిమాలు చేస్తూనే ఉంది. అయితే 16 ఏళ్ళ కెరీర్ లో చాలా సినిమాలకు నో చెప్పింది కాజల్. ముఖ్యంగా తనకు బాగా అచ్చొచ్చిన ప్రభాస్, తేజ లాంటి వాళ్లకు కూడా అప్పుడప్పుడూ నో చెప్పింది కాజల్. అసలు ఇప్పటి వరకు కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటి.. ఎందుకు నో చెప్పిందో చూద్దాం పదండి.. Photo : Twitter
అలివేలు మంగ వెంటక రమణ: కాజల్ అగర్వాల్ కు లైఫ్ ఇచ్చిన దర్శకుడు తేజ. ఆయనే లక్ష్మీ కళ్యాణం సినిమాతో ఈమెను పరిచయం చేసాడు. అందుకే తేజ ఎప్పుడు అడిగినా కూడా ఆమె మాత్రం నో అనదు. ఫ్లాపుల్లో ఉన్న తేజను నమ్మి.. తనకంటే క్రేజ్ లో చాలా తక్కువ అయిన రానాతో నేనేరాజు నేనేమంత్రి సినిమాలో నటించింది కాజల్. ఆ వెంటనే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన సీత సినిమాలోనూ నటించింది. అయితే అలివేల వెంటక రమణ అనే సినిమాను తేజ ఆ మధ్య అనౌన్స్ చేసాడు. గోపీచంద్ హీరోగా నటించబోయే ఈ చిత్రంలో కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఈమె మాత్రం ఈ చిత్రం ఒప్పుకోలేదు. దాంతో తాప్సీని తీసుకున్నాడు దర్శకుడు తేజ. Photo : Twitter
సాహో:.. ప్రభాస్ తో కాజల్ అదిరిపోయే కాంబినేషన్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు మంచి విజయం అందుకున్నాయి. వరసగా ఈ రెండు సినిమాలు కలిసి చేసారు కాజల్, ప్రభాస్. దాంతో ఈ కాంబినేషన్ రిపీట్ చేయాలని చాలా మంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు కానీ కుదర్లేదు. మధ్యలో రెబల్ సినిమా కోసం కాజల్ ను అడిగినా కుదర్లేదు. ఆ తర్వాత మొన్నటికి మొన్న సాహో సినిమాలోనూ జాక్వలిన్ చేసిన ఐటం సాంగ్ కోసం ముందు కాజల్ నే సంప్రదించారు. కానీ నో అని చెప్పేసింది కాజల్. Photo : Twitter
తేజ సినిమా: సాధారణంగా టాప్ హీరోలతో నటించే ఛాన్స్ వస్తే ఎవ్వరూ వదులుకోరు. కానీ కాజల్ మాత్రం డిఫెరెంట్. వెంకటేష్ లాంటి హీరోతో నటించే అవకాశం వచ్చినపుడు కాదనేసింది కాజల్. అప్పట్లో తేజ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఓ సినిమా అనుకున్నారు. అందులో ముందుగా కాజల్ నే హీరోయిన్ గా ఎంపిక చేయాలనుకున్నారు. అయితే అనుకోని కారణాలతో ముందు ఒప్పుకుని.. ఆ తర్వాత సినిమా నుంచి తప్పుకుంది. విచిత్రమేంటంటే ఈ చిత్రం కూడా తర్వాత ఆగిపోయింది. Photo : Twitter
తూంగావనం: కమల్ హాసన్ తో ఇప్పుడు ఇండియన్ 2 సినిమాలో నటిస్తుంది కాజల్. అయితే దానికి ముందు ఓ సినిమాలో నటించడానికి నో చెప్పింది కాజల్. కమల్ హాసన్ హీరోగా తూంగావనం అనే సినిమా వచ్చింది. అందులో నటించడానికి కాజల్ అగర్వాల్ కు ఆఫర్ వచ్చింది. కానీ అందులో నటించడానికి ఒప్పుకోలేదు కాజల్. పైగా డబుల్ రెమ్యునరేషన్ కూడా అడిగిందనే వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు కాంబినేషన్ మిస్ అయినా కూడా ఇప్పుడు ఇండియన్ 2 లో కలిసి నటిస్తున్నారు కాజల్, కమల్.. Photo : Twitter
ఉదయనిధి స్టాలిన్ సినిమా: తమిళంలోనే ఎక్కువ సినిమాలకు నో చెప్పింది కాజల్. తెలుగులో వరస సినిమాలతో బిజీగా ఉండటంతో అక్కడ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోడానికి చందమామకు టైమ్ సరిపోలేదు. ఇక్కడ ఆచార్య సినిమా ఒప్పుకున్న తర్వాత తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సినిమాలో నటించడానికి ఆఫర్ వచ్చింది. అయితే చిరంజీవి సినిమాతో బిజీగా ఉండటంతో స్టాలిన్ సినిమాను వదిలేసింది కాజల్. అయితే ఆ దర్శకుడితో ఇదివరకే కోమలి అనే సినిమా చేసింది చందమామ. అయినా కూడా మరో అవకాశం ఇస్తే నో చెప్పేసింది. Photo : Twitter
పైసా వసూల్: బాలయ్య స్టార్ హీరోయిన్లతో నటించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఫామ్ లో లేని హీరోయిన్లకే ఎక్కువగా అవకాశాలు ఇస్తుంటాడు బాలయ్య. స్టార్ హీరోయిన్ల వెంట పడి.. తీరా వాళ్లు డేట్స్ ఇవ్వకుండా లేట్ చేస్తే బాలయ్యకు అస్సలు నచ్చదు. అందుకే తన సినిమా తప్ప మరో సినిమా లేని హీరోయిన్లనే ఎంచుకుంటాడు నటరత్న. ఇదిలా ఉంటే ఈయన నటించిన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో ముందు కాజల్ నే హీరోయిన్ గా అనుకున్నారు కానీ ఆమె ఆ సమయంలో ఖైదీ నెం 150తో బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయింది. దానికి ముందు పైసా వసూల్ సినిమాను కూడా వదిలేసింది కాజల్. Photo : Twitter
వైల్డ్ డాగ్: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నలుగురు అగ్ర హీరోల్లో ఇప్పటి వరకు చిరంజీవితో మాత్రమే నటించింది కాజల్. అయితే మిగిలిన ముగ్గురితో నటించే అవకాశం వచ్చినా కూడా కొన్ని కారణాలతో వదిలేసుకోవాల్సి వచ్చింది. అలా నాగార్జునతో కూడా ఓ సినిమాను వదిలేసింది కాజల్ అగర్వాల్. అదే వైల్డ్ డాగ్. ఈ చిత్రంలో ముందు కాజల్ నే తీసుకోవాలని అనుకున్నాడు దర్శకుడు సోలోమెన్. అయితే ఆ సమయంలో ఆమె పెళ్లి పనుల్లో బిజీగా ఉండటంతో వైల్డ్ డాగ్ లో నటించే అవకాశం రాలేదు. నాగార్జున, ప్రవీణ్ సత్తారు ఘోస్ట్ సినిమాలో కాజల్ హీరోయిన్ గా ఎంపికైనా.. ప్రెగ్నెన్సీ కారణంగా అందులోంచి కూడా తప్పుకుంది. Photo : Twitter
తమిళ సినిమా: కాజల్ అగర్వాల్ వయసు 30 దాటిపోయింది. ఈ రోజుల్లో హీరోయిన్లు 30 దాటిన తర్వాత మెల్లగా అమ్మ పాత్రలు చేస్తున్నారు. హీరోయిన్ గానే ఉంటూ తమకు ఓ బిడ్డ ఉంటాడంటే కథ ప్రకారం సరే అంటున్నారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం దీనికి నో అంటుంది. ఈ మధ్యే ఓ తమిళ దర్శకుడు చెప్పిన సస్పెన్స్ థ్రిల్లర్ కు ఫిదా అయిపోయింది కాజల్. కథ మొత్తం విని అదిరిపోయింది చేసేద్దాం అని కూడా చెప్పేసింది. చివరి నిమిషంలో సినిమాలో ఐదేళ్ళ కొడుకుకు తల్లి మీరు అని దర్శకుడు చెప్పేసరికి కథ నచ్చినా కూడా చేయలేదు. వెంటనే ఈ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ రిజెక్ట్ చేసింది. Photo : Twitter
అమర్ అక్బర్ ఆంటోనీ: రవితేజతో నటించే అవకాశం కూడా ఓ సారి వదిలేసింది కాజల్. ఇప్పటికే ఈయనతో రెండు సినిమాలు చేసింది. వీర, సారొచ్చారు సినిమాల్లో కలిసి నటించారు రవితేజ, కాజల్. కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ అయ్యాయి. అయితే మూడోసారి డిజాస్టర్ ఇచ్చే అవకాశం చాలా తెలివిగా వదిలేసింది కాజల్. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ముందు కాజల్ అగర్వాల్ నే హీరోయిన్ గా అనుకున్నారు. అయితే అప్పుడు ఉన్న బిజీ ప్రాజెక్టుల వల్ల ఈ చిత్రాన్ని వదిలేసింది కాజల్. అలా రవితేజతో హ్యాట్రిక్ ఫ్లాపులు ఇచ్చే అవకాశం మిస్ అయిపోయింది. లేదంటే రవితేజ, కాజల్ అంటేనే నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చేది. Photo : Twitter