బాలీవుడ్ స్టార్ నటీనటులు అలియా భట్ రణబీర్ కపూర్ ఒకరు. ఈ జంట ఏప్రిల్ 14, 2022 న వివాహం చేసుకున్నారు. బ్రహ్మాస్త్ర సినిమా సెట్లో వీరు ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట ఈ ఏడాదే ఓ ఆడ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. కూతురు పేరు రాహాగా పెట్టారు ఆలియా, రణ్‌బీర్.
బాలీవుడ్ ప్రముఖ నటి మౌని రాయ్ దుబాయ్ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను జనవరి 27న గోవాలో వివాహం చేసుకున్నారు. పలు హిందీ సీరియల్స్‌లో నటించిన మని రాయ్ ఆ తర్వాత బాలీవుడ్లో సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నారు. ఈమె.. బ్రహ్మస్త్రలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు.
సౌత్ స్టార్ సెలబ్రిటీల్లో నయనతార, విఘ్నూశ్ శివన్ ఒకరు. ఈ జంట దాదాపు ఏడేళ్ల పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ ఏడాది జూన్ 10న ఈ జంట పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన నాలుగు నెలలకే.. సరోగసి ద్వారా కవల పిలలకు తల్లిదండ్రులుగా మారారు.
రిచా చద్దా మరియు అలీ ఫజల్ సెప్టెంబర్ 30న వివాహం చేసుకున్నారు. కరోనా కారణంగా వీరి పెళ్లి వాయిదా పడింది.వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.
ప్రముఖ హీరోయిన్ హన్సిక డిసెంబర్ 4న ముంబై వ్యాపార వేత్త సోహైల్‌ను పెళ్లి చేసుకుంది. సింధీ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.
టాలీవుడ్ ప్రముఖ నటి పూర్ణ అలియాస్ షమ్నా కాసిం తన చిరకాల ప్రియుడితో వివాహ జీవితంలోకి అడుగుపెట్టింది. పూర్ణగా ప్రసిద్ధి చెందిన ఈ నటి అక్టోబర్ 25న కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకుంది. ఈమె భర్త దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త.
అదితి ప్రభుదేవా యషాస్ని వివాహం చేసుకున్నారు మరియు వారి వివాహం నవంబర్ 28న జరిగింది. యశాస్ సినిమా పరిశ్రమకు చెందిన వాడు కాదు.