Allu Arjun Rejected Movies: అల్లు అర్జున్, పుష్ప సినిమాతో ఇండియా లెవల్లో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు హిందీ బెల్ట్‌లో కూడా అదరగొట్టింది. అది అలా ఉంటే గంగోత్రితో హీరోగా మొదలైన అల్లు అర్జున్ సినిమా కెరీర్లో సగానికి ఎక్కువగా హిట్లే.. అయితే ఏ హీరో అయిన తన దగ్గరకు వచ్చిన అన్ని సినిమాలను చేయలేరు.. అలా బన్ని వదులుకున్న వాటిలో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి.. అవేంటో చూద్దాం..
జయం: అల్లు అర్జున్ను ఇండస్ట్రీకి తీసుకురావాలని అల్లు అరవింద్ భావిస్తున్న సమయంలో తేజ మంచి పీక్స్ లో ఉన్నారు. దాంతో తన కుమారుడి బాధ్యతలు తేజకు అప్పగించాలని అప్పట్లో భావించారు అల్లు అరవింద్. ఈ క్రమంలోనే జయం సినిమా ముందు బన్నీతో చేయాలనుకున్నారు. అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. అదే సినిమా నితిన్ కెరీర్ కు గట్టి పునాది వేసింది. Photo : Twitter
భద్ర: సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నప్పుడు బోయపాటి శ్రీను తాను రాసుకున్న భద్ర కథ ముందుగా అల్లు అర్జున్ కు చెప్పారు. అయితే అప్పుడే ఆర్య లాంటి ఫ్రెష్ లవ్ స్టోరీ చేస్తుండడంతో అలాంటి మాస్ మసాలా సినిమాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు బన్నీ. అలా భద్ర సినిమాలో వదిలేశారు అల్లు అర్జున్. కానీ పదేళ్ల తర్వాత ఇదే కాంబినేషన్లో సరైనోడు సినిమా వచ్చింది. Photo : Twitter
100 పర్సెంట్ లవ్: సుకుమార్ తాను ఏ కథ రాసుకున్న ముందు అల్లు అర్జున్ కు చెబుతాడు. అలా 100 % లవ్ సినిమా కథ కూడా ముందు బన్నీకి చెప్పాడట. కానీ ఎందుకో ఈ కథకు అసలు కనెక్ట్ కాలేకపోయాడు అల్లు అర్జున్. పైగా ఈ సాఫ్ట్ లవ్ స్టోరీస్ తనకు పెద్దగా సెట్ అవ్వవని సుకుమార్ కు చెప్పాడు కూడా. అయితే ఈ కాంబినేషన్ లో ఇటీవల పుష్ప సినిమా వచ్చి అదరగొట్టింది. Photo : Twitter
కృష్ణాష్టమి: సునీల్ హీరోగా వచ్చిన కృష్ణాష్టమి సినిమాలో ముందు అల్లు అర్జున్ హీరోగా నటించాల్సి ఉంది. జోష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వాసు వర్మ.. లవర్ పేరుతో బన్నీ కోసం ఈ కథ సిద్ధం చేశాడు. దిల్ రాజు నిర్మాత అనుకున్నారు. కానీ ఆయన రిజెక్ట్ చేసేసరికి సునీల్ తో కృష్ణాష్టమి టైటిల్ తో సినిమా చేసాడు. అది దారుణంగా బెడిసికొట్టింది. ఇది వచ్చిన తర్వాత దిల్ రాజు బ్యానర్లో డిజె సినిమా చేశాడు అల్లు అర్జున్. Photo : Twitter
పండగ చేస్కో: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన పండగ చేస్కో సినిమాలో కూడా ముందు అల్లు అర్జున్ హీరోగా నటించాల్సి ఉందని టాక్. ఈ క్రమంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేని, రైటర్ కోన వెంకట్ ఇద్దరు వెళ్లి కథ కూడా చెప్పారట. ఎంటర్టైన్మెంట్ బాగానే ఉన్నా కూడా ఎందుకో ఈ కథకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దాంతో రామ్ హీరోగా పండగ చేస్కో సినిమా వచ్చింది. Photo : Twitter
అర్జున్ రెడ్డి: సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అర్జున్ రెడ్డి ఈ సినిమాతో ఒక్కసారిగా నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. ఇంతటి సంచలన కథ ముందు అల్లు అర్జున్ కి చెప్పాడు సందీప్. అయితే అలాంటి కథ చేయడానికి బన్నీ ధైర్యం చేయలేకపోయాడు. దాంతో ఇదే సినిమా విజయ్ దేవరకొండతో చేసి సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా. గతంలో ఈ క్యారెక్టర్ కి దగ్గరగా ఉండే పాత్ర ఆర్య 2లో పోషించాడు అల్లు అర్జున్. Photo : Twitter
గ్యాంగ్ లీడర్: మనం లాంటి క్లాసిక్ సినిమాను తెలుగు ఇండస్ట్రీకి అందించిన విక్రమ్ కె కుమార్.. తన గ్యాంగ్ లీడర్ కథ ముందు అల్లు అర్జున్ కు చెప్పాడు. ఈ ప్రాజెక్టు ఆల్మోస్ట్ సెట్ అయింది. కానీ చివరి నిమిషంలో ఎందుకో డ్రాప్ అయ్యాడు అల్లు అర్జున్. దాంతో ఈ కథని నానితో తెరకెక్కించాడు విక్రమ్ కే కుమార్. అక్కడ కూడా గ్యాంగ్ లీడర్ వర్కౌట్ కాలేదు. తర్వాత కూడా రెండు మూడు కథలు చెప్పినా పెద్దగా వర్కవుట్ కాలేదు. Photo : Twitter
డిస్కో రాజా: విలక్షణ సినిమాల దర్శకుడు వి.ఐ.ఆనంద్.. డిస్కో రాజా సినిమా అల్లు అర్జున్ తోనే ప్లాన్ చేశాడు. ఈ కథను ముందు బన్నీకి చెప్పి ఒప్పించాలని చూశాడు ఆనంద్. అంతకు ముందు అల్లు శిరీష్ హీరోగా ఒక క్షణం సినిమా చేశాడు ఈయన. అలా బన్నీతో ఉన్న సాన్నిహిత్యంతో డిస్కో రాజా కథ చెప్పాడు. కానీ ఈ కథకు ఎక్కడా కనెక్ట్ కాలేకపోయాడు అల్లు అర్జున్. ఇదే కథను రవితేజతో చేసిన వర్కౌట్ కాలేదు. ప్రయోగం బాగుంది అన్నారు కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు డిస్కో రాజా. Photo : Twitter
గీత గోవిందం: విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ గా మారడంలో అల్లు అర్జున్ పాత్ర చాలా ఉంది. అర్జున్ రెడ్డి కథను రిజెక్ట్ చేసి విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఆ తర్వాత గీత గోవిందం కథ కూడా కాదు అనుకున్నాడు. సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఉండడంతో అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ ఈ కథకు అడ్డు వచ్చింది. అందుకే కూడా చేయలేకపోయాడు బన్నీ. ఇదే సినిమా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించి సంచలన విజయం అందుకొన్నాడు దర్శకుడు పరశురామ్. త్వరలోనే బన్నీతో సినిమా చేస్తానంటున్న పరశురామ్. Photo : Twitter
జాను: తమిళంలో సంచలన విజయం సాధించిన 96 సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నప్పుడు.. అల్లు అర్జున్ హీరోగా చేస్తే బాగుంటుందని దిల్ రాజు భావించాడట. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రేమ్ కుమార్ తో కథ కూడా చెప్పించాడు. అయితే మరీ అంత సాఫ్ట్ లవ్ స్టోరికి తాను సెట్ అవ్వాలని సున్నితంగా రిజెక్ట్ చేశాడు అల్లు అర్జున్. తర్వాత ఇదే సినిమాను శర్వానంద్, సమంత జంటగా జాను పేరుతో రీమేక్ చేస్తే తెలుగులో డిజాస్టర్ అయింది. చివరికి బన్నీ చెప్పిందే నిజమైంది. Photo : Twitter
బొమ్మరిల్లు: సిద్ధార్థ హీరోగా వచ్చిన ఆల్ టైం క్లాసిక్ బొమ్మరిల్లు సినిమాలో కూడా ముందుగా అల్లు అర్జున్ ను హీరోగా అనుకున్నారు. ఈ మేరకు దర్శకుడు భాస్కర్ వెళ్లి కథ కూడా చెప్పాడు. అల్లు అర్జున్ కి ఈ కథ నచ్చింది కూడా. అయితే అప్పుడు హ్యాపీ సినిమాతో బిజీగా ఉండడంతో బొమ్మరిల్లు చేయలేకపోయాడు అల్లు అర్జున్. ఆయనతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాను కాదనుకున్నాడు. బొమ్మరిల్లు కథ అంత బాగా నచ్చింది కాబట్టి వెంటనే భాస్కర్ దర్శకత్వంలో పరుగు సినిమా చేశాడు అల్లు అర్జున్. ఇలా కెరీర్లో దాదాపు 10 సినిమాలకు పైగానే వదిలేశాడు అల్లు అర్జున్. Photo : Twitter