కరోనా కష్టాల తర్వాత ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీ అంతా కళకళలాడింది. 2022లో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అందులో కొన్ని మల్టీ స్టారర్ మూవీలుకూడా ఉన్నాయి. ఈ ఏడాది వచ్చిన మల్టీ స్టారర్ సినిమాల్లో బంగార్రాజు ఒకటి. ఈ సినిమాలో అక్కినేని హీరోలు నాగార్జున నాగచైతన్య కలిసి నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.
దర్శకధీరుడు తెరకెక్కించిన అద్భుతమైన మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భీం పాత్రలో ఎన్టీఆర్, పోలీస్ ఆఫీసర్‌గా రామ్ పాత్రలో రామ్ చరణ్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఇప్పటిరకు ఈ సినిమా ఎన్నో రికార్డుల్ని క్రియేట్ చేయడమే కాకుండా... అవార్డులు కూడా సొంతం చేసుకుంది. మార్చి 25న ఆర్ఆర్ఆర్ విడుదల అయింది.
భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన సినిమా, మెగా హీరో నటించిన ఈ సినిమాలో దగ్గుబాటి హీరో టాలీవుడ్ హంక్ రానా నటించిన విషయం తెలిసిందే. వీరిద్దరు నటించడంతో భీమ్లానాయక్ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు. పవన్ పోలీస్ గా నటిస్తే.. రానా విలన్ గా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.(Twitter/Photo)
అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ ఎఫ్3, ఈ సినిమా ఆడియన్స్‌కు ఎంతగానే వినోదాన్ని పంచింది. ఈ మూవీలో వెంకటేష్ హీరోగా, వరుణ్ తేజ్ మరో హీరోగా నటించారు. ఇక తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా మెరిశారు. బుట్టబొమ్మ పూజా హెగ్డే ప్రత్యేక పాటలో మెరిసింది. ఎఫ్3సినిమాసినిమా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. F3 movie ott update Twitter
చిరంజీవి, రామ్ చరణ్ నటించిన సినిమా ఆచార్, ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ ఈసినిమా ద్వారా తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యింది, ఈ సినిమా మెగాస్టార్ కెరీర్లో డిజాస్టర్‌గా నిలిచింది. కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. (Acharya/Twitter)
ఆచార్య తర్వాత చిరంజీవి నటించిన మరో మల్టీ స్టారర్ గాడ్ ఫాదర్. ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన విషయం తెలిసిందే. దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 5న రిలీజ్ చేశారు. అయితే గాడ్ ఫాదర్ సినిమాను మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ మూవీకి రిమేక్. Chiranjeevi and Salman Twitter
ఇక విక్టరీ వెంకటేష్ కూడా ఈ ఏడాది ఎఫ్త్రితో పాటు మరో మల్టీస్టారర్ సినిమా తీశారు. అదే... ఓరిదేవుడా, విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో వెంకీ కూడా కీలక రోల్ లో నటించి మెప్పించారు. ఇటీవలేద విడుదలైన ఓరిదేవుడా మూవీ ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా ఇక యూత్ ని బాగా ఆకర్షించింది.