నిరుద్యోగులకు ఉద్యోగాల జాతర మొదలైంది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు.. కేంద్రం నుంచి కూడా భారీగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. అయితే ఇటీవల విడుదలైన పలు నోటిఫికేషన్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
12వ తరగతితో ఏదైనా ITI చేసి ఉంటే లేదా గ్రాడ్యుయేషన్లో ఉత్తీర్ణత సాధించి ఏదైనా జాతీయ లేదా రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొన్నట్లయితే.. రైల్వేలో ఉద్యోగం పొందడానికి మీకు అర్హత ఉంటుంది. సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద వివిధ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సదర్శించొచ్చు.
ఇండియన్ నేవీలో సీనియర్ సెకండరీ రిక్రూట్ మరియు మెట్రిక్ రిక్రూట్ కింద అగ్నివీర్స్ రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ విడుదల అయింది. దీని కోసం ఆన్లైన్ దరఖాస్తులు డిసెంబర్ 8 నుండి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు డిసెంబర్ 17 వరకు దరఖాస్తును సమర్పించగలరు. రిక్రూట్మెంట్ కింద 10, 12 ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇండియన్ నేవీలో ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 05 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. అభ్యర్థులు ఏదైనా డిగ్రీతో పాటు.. బీఈడీ, డీఈడీ, సీటెట్ అర్హతలుంటే టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నాన్ టీచింగ్ అభ్యర్థులు సంబంధిత పోస్టులను అనుసరించి అర్హతలుండాలి. వివరాలకు https://kvsangathan.nic.in/ సందర్శించొచ్చు.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవల్ పోస్టులను నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4500 పోస్టులను భర్తీ చేస్తారు. దరఖాస్తులు డిసెంబర్ 06, 2022 నుంచి మొదలయ్యాయి. 10+2 అర్హత ఉన్నవాళ్లు లోయర్ డివిజన్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://ssc.nic.in/ సందర్శించండి.
టీఎస్పీఎస్సీ నుంచి భారీగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. దీనిలో భాగంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ నుంచి 57 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో గెజిటెడ్ పోస్టులకు డిసెంబర్ 06, 2022 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా.. నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 07, 2022 ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ను సందర్శించండి.
డిసెంబర్ 01, 2022న టీఎస్పీఎస్సీ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ 4లో ఖాళీగా ఉన్న 9168 పోస్టులను భర్తీ చేయనున్నారు. జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, ఆడిటర్ అండ్ వార్డు ఆఫీసర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పూర్తి నోటిఫికేషన్ డిసెంబర్ 23, 2022న వెబ్ సైట్ లో అందుబాటులో ఉండనుంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.