Software Development
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీకి ఇటు.. వ్యక్తిగత జీవితానికి ఎంతో ఆధారపడి ఉంటుంది. దీనిపై పట్టు ఉన్నవాళ్లకు మర్కెట్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. డేటా మేనేజ్మెంట్ నైపుణ్యాలు కూడా ప్రముఖమైనవే. (ప్రతీకాత్మక చిత్రం)
SQL(Structured Query Language)
టాప్ 10 జాబితా ఈ లాంగ్వేజ్ ప్రోగ్రాం అనేది రెండో స్థానాన్ని ఆక్రమించింది. కంపెనీలు వ్యాపారం అంతటా డేటాను నిర్వహించడంలో.. అర్థం చేసుకోవడంలో ఇధి సహాయపడతుంది. ప్రస్తుతం అధికంగా ఈ SQL నేర్చుకున్న వారికి ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Operations
1970ల ప్రారంభంలో ఆపరేషనల్ ఎక్సలెన్స్ అనే భావనను మొదటిసారిగా పరిచయం చేశారు. ఆపరేషనల్ ఎక్సలెన్స్ అంటే ప్రతి ఉద్యోగి కస్టమర్‌కు తమ సమయాన్ని కేటాయించి వారికి కావాల్సిన విధంగా సాఫ్ట్ వేర్ కు సంబంధించిన అవసరాలు, నాణ్యత, డిమాండ్స్ పై వచ్చే ప్రతీ సందేహాన్ని తీర్చాల్సి ఉంటుంది. వీరిని ఆపరేషన్ ఎక్సలెన్స్ గా పిలుస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
Finance
ఫైనాన్స్ కు సంబంధించి కూడా సాఫ్ట్ వేర్ రంగంలో ఉత్తమ ను అందిస్తున్నాయి. వీటి ద్వారా కంపెనీలో హెచ్ ఆర్ విభాగంలో ఉద్యోగాలు ఉంటాయి. కంపెనీలో ఆర్థిక లావాదేవీల విషయాలను ఈ ఫైనాన్స్ చేసిన వాళ్లు నిర్వహించాల్సి ఉంటుంది. కార్పొరేట్ ఆర్థిక నివేదికలను అర్థం చేసుకునే సామర్థ్యం వంటివి ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
Python (Programming Language)
కంప్యూటర్ భాషకు సంబంధించి ఎన్నో ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న భాష పైథాన్. దీని ద్వారా ఐటీలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
Java
జావా అంటే కంప్యూటర్ లాంగ్వేజ్. జావా అనేది పాత భాష ప్రోగ్రాం అయినప్పటికీ.. ఇప్పటికే ఎలాంటి డిమండ్ కోల్పోనిదిగా నిలబడింది. ఈ భాషను నేర్చుకున్న ప్రతీ ఒక్క అభ్యర్థి ఐటీ ఉద్యోగం సాధించవచ్చు.
Data Analysis
ప్రస్తుతం ట్రెండిగ్ లో ఉన్న కోర్సు ఇదే. భవిష్యత్ అంతా డేటా అనాలసిస్ పైనే ఆధారపడి ఉంటుంది. రోబోటిక్స్, ఆర్టఫిషియల్ ఇంటెల్లిజెన్స్ కు సంబంధించి వాటిని నేర్చుకునే క్రమంలో డేటా అనాలసిస్ కు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. (ప్రతీకాత్మక చిత్రం)
JavaScript
జావాస్క్రిప్ట్ అనేది ECMAScript ప్రమాణానికి అనుగుణంగా ఉండే ఒక ఉన్నత-స్థాయి భాష . ఇంటర్నెట్ లో ఎక్కువగా ఈ జావా స్క్రిప్ట్ ను ఉపయోగిస్తుంటాము. దీనికి కూడా మార్కెట్లో మంచి ఉద్యోగ అవాకాశాలు ఉన్నట్లు లింక్డిన్ తన వెబ్ సైట్లో పొందరుపరిచింది. (ప్రతీకాత్మక చిత్రం)
Cloud Computing
రానున్న కాలంలో క్లౌడ్ కంప్యూటింగ్ మొత్తం ైటీ అవస్థాపనలోనే మౌలికంగా మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంటది. ఇది వినయోగదారులకు సర్వీసర్ ఆధారిత అప్లికేషన్లను అందించడమే కాకుండా.. వినియోగదారునికి ఎలా కావాలో ఆ విధంగా వృద్ధి చేయాల్సి ఉంటుంది. దీనిపై కూడా ఉద్యోగాలు ఉన్నట్లు లింక్డిన్ పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)
Customer Relationship Management
ఏ కంపెనీ అయినా వస్తువులను ఉత్పత్తి చేసిన తర్వాత సేల్స్ చేయాల్సి ఉంటుంది. సేల్స్ అనేవి అధికంగా లేకపోతే.. ఎంత పని చేసినా ఉద్యోగం ఉండదు. అంతిమ వస్తు సేవల ఉత్పత్తిని అధిక రేట్ తో విక్రయించనప్పుడే అ కంపెనీలో పని చేసి ఉద్యోగులకు మంచి జీతం లభిస్తుంది. సేల్స్ కు సంబంధించిన లావాదేవీలు, డిమండ్ కు తగ్గట్టు ఎగుమతి, దిగుమతులను కస్టమర్ రిలేషన్ మేనేజ్ మెంట్ పని. (ప్రతీకాత్మక చిత్రం)