Meta: ఫేస్ బుక్ మాతృసంస్థ అయిన మెటా దాదాపు 11 వేల ఉద్యోగులను ఇటీవల తొలగించి ఆర్థిక మాంద్యం భయాలను రెట్టింపు చేసి.. ఇతర సంస్థల్లోని ఉద్యోగులను సైతం ఆందోళనలోకి నెట్టింది.
Amazon: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ సైతం 3 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగించింది.
Uber: ఉబెర్ సంస్థ ఏకంగా 27 శాతం మంది ఉద్యోగాల కోతను విధించింది. దాదాపు 6700 మంది ఉద్యోగులకు ఉద్యాసన పలికింది.
Booking.com: ఈ సంస్థ 25 శాతం మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. 6700 ఉద్యోగులను తొలగించింది.
CISCO: సిస్కో సంస్థ సైతం 4100 మంది ఉద్యోగులను తొలగిచింది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగుల్లో 5 శాతం.
Twitter: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఏకంగా 50 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. ఎలాన్ మాస్క్ చేతుల్లోకి వెళ్లాక 3700 మంది ఉద్యోగులు ఇంటి బాట పట్టాల్సి వచ్చింది.
Better.com: ఈ సంస్థ సైతం తన 33 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. 3 వేల మందిని ఇంటికి పంపించింది.
peloton: ఈ సంస్థలో 20 శాతం మంది ఉద్యోగులు ఇంటి బాట పట్టాల్సి వచ్చింది. 2800 మంది సంస్థ నుంచి తొలగించబడ్డారు.
Groupon: ఈ సంస్థలో 44 శాతం మంది ఉద్యోగులను యాజమాన్యం తొలగించింది. మొత్తం 2800 మంది ఉద్యోగులకు ఉద్యాసన పలికింది.
Byjus: ప్రముఖ ఆన్లైన్ టీచింగ్ ప్లాట్ ఫాం అయిన బైజూస్ లో 2500 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. సంస్థ మొత్తం ఉద్యోగుల్లో ఈ సంఖ్య 5 శాతం