తెలంగాణలో పోలీస్ అభ్యర్థులకు ఈవెంట్స్ తేదీలు ఖరారయిన విషయం తెలిసిందే. డిసెంబర్ 08, 2022 నుంచి జనవరి మొదటి వారంలోపు ఈ పోలీస్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. గురువారం నుంచి జరగనున్న ఈవెంట్స్ కు అభ్యర్థులు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి.. ఈవెంట్స్ ను సులువుగా సాధించేందుకు నిపుణులు చెబుతున్న సూచనలపై ఓ లుక్కేంద్దాం.
ఈవెంట్స్ కు రెండు రోజుల ముందు శరీరానికి పూర్తిగా రెస్ట్ అవసరం. ఒక్క రోజు ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిద్ర లేకుండా గడపవద్దు. నిద్ర అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది. ఈ ఒక్క రోజు కు దూరంగా ఉండంటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
మీ హాల్ టికెట్స్ లో పేర్కొన్న ఈవెంట్ సెంటర్ కు ఒక రోజు ముందుగా వెళ్లండి. ఆ ప్రాంతంలో ఎవరూ తెలియని వారు లేకపోతే.. హోటల్ లో ఉండి తగి విశ్రాంతి తీసుకోండి. ఈవెంట్స్ కు ఒక రోజు ముందు లైట్ ఫుడ్ తీసుకోండి. ఇడ్లీ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తే మంచిది.
ఈవెంట్స్ కు ఒక వారం ముందు నుంచే రాత్రి 8 గంటలకే నిద్రపోవడం అలవాటు చేసుకోండి. గ్రౌండ్ లో వారం ముందు నుంచి ఎక్కువ వర్కౌట్స్ చేయకపోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈవెంట్స్ రోజు ఎలాంటి టెన్షన్లకు గురికాకండి. మీ ఫోకస్ అంతా.. విజయవంతంగా ఈవెంట్స్ ను కంప్లీట్ చేసే దానిపైనే ఉండాలి. (Image Credit : Youtube)
ఈవెంట్స్ రోజు ఉదయం 6 గంటలకు రిపోర్ట్ ఉంటుంది. కావునా మీరు 5.30కే మీ సెంటర్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. జర్నీ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇక మీ వద్ద కుల ధ్రువీకరణ పత్రం, అడ్మిట్ కార్డు, పార్ట్ 2 అప్లికేషన్ ఫారమ్ ఉండాలి. వీటిపై మీ సంతకం(సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ) చేసి ఉండాలి. ఏజెన్సీకి చెందిన వారు ఏజెన్సీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్ మెన్లకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు అవసరం.
ఈవెంట్స్ జరిగే అరగంట ముందు టాయిలెట్ కు వెళ్లడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముందుగా 1600/800 మీటర్ల పరుగు పందెం ఉంటుంది. కనుక పరుగు పందెంకు ముందు శరీరాన్ని యాక్టివ్ చేసుకోవడానికి వార్మ్ అప్స్ చేయాలి. దీని వల్ల.. నరాలు అన్నీ సలువుగా కదులుతాయి. చలికాలం కారణంగా బిగుసుకుపోయిన నరాలు, కండరాలు యాక్టివ్ స్టేజీలోకి వస్తాయి. దీని కారణంగా పరుగు లో ఇబ్బంది పడకుండా ఉంటారు. (Image Credit : YouTube)
రన్నింగ్ చేసే సమయంలో ముందు, వెనుక ఉన్న వాళ్లని అస్సలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలి. లాస్ట్ 200 మీటర్ల పరుగు ఉందనగా.. మీ స్సీడ్ ను అమాంతం పెంచాలి. ఇలా చేస్తే మీకు మరింత మెరుగ్గా మార్కులు వస్తాయి. ఇక దీనిలో అర్హత సాధించిన వారిని తదుపరి షార్ట్ ఫుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ కు అనుమతిస్తారు. ఈ రెండు అర్హత సాధించాలంటే.. టెన్షన్ కు గురికావొద్దని నిపుణులు చెబుతున్నారు. (Image Credit : YouTube)