గ్రూప్ 4 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అమోదం లభించడంతో.. ఈ పోస్టులకు సంబంధించి త్వరగా నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో కమిషన్ ఉన్నట్లు సమాచారం. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇటీవల గ్రూప్ 2 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. ఈ పోస్టులను వచ్చే నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 663 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇంతకముందు విడుదల చేసిన నోటఫికేషనల్లో ఈ పోస్టులను గ్రూప్ 2లోనే కలిపి నియామకాలు చెపట్టేవారు. కానీ.. ఈ సారి గ్రూప్ 3 పోస్టులకు మొదటి సారిగా విడిగా నోటిఫికేషన్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు వచ్చే నెలలో 1373 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల కానున్నాయి.
గురుకుల పోస్టులు దాదాపు 10వేలకు పైగా ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు నియామక బోర్డు. హారిజంటల్ రిజర్వేషన్ కు సంబంధించి కోర్డు తీర్పు వచ్చిన వెంటనే ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది.
ఇటీవల అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ (AMVI) పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి దీనిని రద్దు చేసిన విషయం తెలిసిందే. అర్హత విషయంలో మహిళా అభ్యర్థులు ఆందోళన చేయడంతో.. దీనిని రద్దు చేశారు. అయితే తాజాగా ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఇక తెలంగాణలో జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నికల్ లెక్చరర్స్ లో కూడా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల కానుంది. వీటికి దరఖాస్తు చేసుకునే పోస్టుల్లో కొన్నింటికి సెట్ కానీ.. నెట్ కానీ అర్హత సాధించాల్సి ఉంటుంది. జెఎల్, డీఎల్, పీఎల్ పోస్టులు కలిపి మొత్తం 2వేలకు పైగా ఖాళీగా ఉన్నట్లు సమాచారం.
ఇక ఫారెస్ట్ డిపార్ట్ మెంట్లో FRO, FBO, FSO పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి ఇప్పటికే ఆర్థిక శాఖ నుంచి అనుమతి కూడా లభించింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 1393 ఉన్నాయి. వీటికి నోటిఫికేషన్ అనేది ఏ సమయంలో అయినా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
వీటితో పాటు.. మరికొన్ని నోటిఫికేషన్లు కూడా విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందిన మొత్తం 60వేల ఉద్యోగాల్లో ఇప్పటి వరకు 20 వేల వరకు మాత్రమే నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. మిగిలిన 40 వేల ఉద్యోగాలకు వచ్చే నెలలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి.