భారతదేశం వంటి దేశంలో నివసిస్తున్న విద్యార్థులు మెరుగైన విద్యను పొందడం ఎంత ఖరీదుగా మారిందో చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ సమయంలో ఖరీదైన విద్య భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉంది. ఈ కారణంగా.. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబ నేపథ్యం నుండి వచ్చిన విద్యార్థులు మంచి చదువు కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది.
అందులోనూ.. మీరు భారతీయ విద్యార్థి అయితే, విదేశాల్లో చదువుకోవాలనుకుంటే, అది మీ ఖర్చులను మరింత పెంచుతుంది. అయితే.. ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇక్కడ చెప్పే 5 దేశాలు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా చౌకగా ఉంటుంది. ఆ వివరాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మీరు జర్మనీలోని ఏదైనా కళాశాలలో లేదా విశ్వవిద్యాలయంలో చదవాలనుకుంటే.. ఇక్కడి విద్యార్థుల నుండి ఎలాంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయరు. దీని వల్ల వారి చదువుల ఖర్చులలో పెద్ద ఉపశమనం లభింస్తుంది. అయితే.. ఇక్కడ ఏటా మీరు రూ.3800 అడ్మినిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. భారతీయ విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి చాలా సులభంగా స్టూడెంట్ వీసా పొందుతారు.
ఫ్రాన్స్ ప్రపంచంలోనే చాలా అందమైన దేశం. భారతీయ విద్యార్థి ఈ దేశంలో చదువుకోవాలనుకుంటే.. చాలా డబ్బు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఇక్కడి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో బ్యాచిలర్లకు గరిష్టంగా 15,000 రూపాయలు, మాస్టర్స్‌కు దాదాపు 30000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పని చేసే హక్కు అందరికీ సమానంగా వర్తిస్తుంది. అంటే.. మీరు విదేశాల నుండి విద్యార్థిగా ఇక్కడికి వచ్చినట్లయితే ఈ హక్కు లభిస్తుంది. విద్య పూర్తయిన తర్వాత కావాలంటే ఇక్కడ ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నివసించడానికి దాంతో పాటు.. చదువుకోవడానికి మీ వార్షిక ఖర్చులు దాదాపు రూ.4 లక్షలు కావచ్చు.
మీరు పోలాండ్‌లో చదువుకోవాలనుకుంటే ఇక్కడ మీకు విద్యార్థి వీసా చాలా సులభంగా లభిస్తుంది. ఈ దేశంలో కూడా విద్యార్థుల నుంచి ఎలాంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయరు. మరో విషయం ఏమిటంటే.. మీకు పోలిష్ భాష తెలిస్తే.. ఇక్కడ విశ్వవిద్యాలయాలలో మీకు అనేక ఇతర సౌకర్యాలు లభిస్తాయి. అయితే.. ఇక్కడ నివసించడం కొంచెం ఖరీదైనది. చదువుకోవడానికి మీరు ఏటా దాదాపు రూ. 6 నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి రావచ్చు.
న్యూజిలాండ్ లో చదువుకోవాలనుకుంటే.. ఇక్కడ మీరు సంవత్సరానికి సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇక్కడి విద్యార్థుల నుండి ట్యూషన్ ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు ఇక్కడి విశ్వవిద్యాలయాలు కూడా విద్యార్థుల ట్యూషన్ ఫీజు కోసం ఫండింగ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తాయి. దాని కింద మీ మొత్తం ట్యూషన్ ఫీజును మాఫీ చేయవచ్చు.
ఇతర దేశాల కంటే దక్షిణాఫ్రికాలో చదువుకోవడం చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఇక్కడి యూనివర్సిటీల సగటు ట్యూషన్ ఫీజు ఏడాదికి రూ.2 లక్షల కంటే తక్కువ. అయితే, ఇక్కడ జీవన వ్యయం కాస్త ఖరీదైనది. ఇక్కడ చదవడానికి మీరు ప్రతి సంవత్సరం 4 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి రావచ్చు. అయినప్పటికీ, ఇక్కడి విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు కూడా వర్తించే వివిధ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌లను కూడా అమలు చేస్తాయి. మీరు ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌లను తీసుకుంటే.. మీ ఫీజులను మరింత తగ్గించవచ్చు.