Cars | కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఏకంగా రూ. 2.5 లక్షల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. జీప్ మెరిడియన్ కారుపై ఈ మేరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అంటే డిస్కౌంట్ మొత్తంలో రెండు కొత్త బడ్జెట్ టూవీలర్లు కొనుగోలు చేయొచ్చని చెప్పుకోవచ్చు. భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కాగా ఈ కారు ఆఫర్లు కేవలం ఈ నెలలో మాత్రమే అందుబాటులో ఉంటాయని గుర్తించుకోవాలి.
అలాగే జీప్ కాంపాస్ కారుపై కూడా భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ కారుపై అయితే రూ. 1.7 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు సొంతం చేసుకోవాలని భావించే వారు ఈ డీల్స్ సొంతం చేసుకోవచ్చు.
ఇంకా టాటా సఫారీ కారుపై కూడా కళ్లుచెదిరే తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ కారుపై అయితే రూ. 1.25 లక్షల దాకా తగ్గింపు ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. టాటా కారు కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్స్ సొంతం చేసుకోవచ్చు.
ఇంకా స్కోడా కుషక్ కారుపై కూడా భారీ తగ్గింపు ఉంది. ఈ కారుపై కూడా రూ. 1.25 లక్షల దాకా డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. ఫోక్స్వ్యాగర్ తైగూన్ కారుపై కూడా ఇదే స్థాయిలో తగ్గింపు బెనిఫిట్స్ లభిస్తున్నాయి.
అలాగే టాటా హరియర్ కారుపై కూడా మీరు సూపర్ డూపర్ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. ఈ కారుపై ఏకంగా రూ. 1.2 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంది. టాటా కారు కొనాలని భావించే వారు ఈ డీల్‌ను సొంత చేసుకోవచ్చు.
ఇంకా హ్యుందాయ్ అల్కాజర్ కారుపై కూడా భారీ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ కారుపై కూడా రూ. 1.2 లక్షల దాకా డిస్కౌంట్ అందుబాటులో ఉంది. హ్యుందాయ్ కారు కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్స్‌ను సొంతం చేసుకోవచ్చు.
అలాగే కియా సెల్టోస్ కారుపై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారుపై కూడా రూ. లక్షకు పైగా తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఈ కారుపై రూ. 1.07 లక్షల దాకా తగ్గింపు లభిస్తోంది. కాగా ఈ కారు ఆఫర్లు అనేవి మీ ప్రాంతం, డీలర్షిప్, కారు వేరియంట్ ప్రాతిపదిక మారుతూ ఉంటాయని గుర్తించుకోవాలి. అందువల్ల మీరు కారు కొనుగోలు చేయాలని భావిస్తే.. దగ్గరిలోని షోరూమ్‌కు వెళ్లి కారు ఆఫర్లు పూర్తిగా తెలుసుకోవడం ఉత్తమం. తర్వాతనే మీకు నచ్చిన ఆఫర్ ఉన్న కారును ఎంపిక చేసుకోవచ్చు.