Top Bikes | 125 సీసీ విభాగంలో బజాజ్ సీటీ 125 ఎక్స్ చౌక ధరకే లభిస్తోందని చెప్పుకోవచ్చు. ఇది రెండు వేరియంట్ల రూపంలో ఉంది. ఈ బైక్ ధర రూ. 72 వేల నుంచి ప్రారంభం అవుతోంది. ఈ బైక్ దాదాపు 60 నుంచి 65 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వొచ్చు. ఇందులో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది.
హీరో సూపర్ స్ల్పెండర్ కూడా అందుబాటు ధరలోనే ఉంది. ఇది ఐదు రకాల వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. దీని ధర రూ. 78 వేల నుంచి ప్రారంభం అవుతోంది. ఈ బైక్ కూడా లీటరుకు 60 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వొచ్చు. దేశంలోని బెస్ట్ సెల్లింగ్ బైక ఇదే. ప్రతి నెలా ఏకంగా 2 లక్షలకు పైగా యూనిట్లు విక్రయం అవుతున్నాయి.
హోండా షైన్ కూడా అదరగొడుతోంది. బెస్ట్ సెల్లింగ్ బైక్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ బైక్ ధర రూ. 79 వేల నుంచి ప్రారంభం అవుతోంది. ఇది నాలుగు రకాల వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇందులో కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఇది లీటరుకు 55 నుంచి 60 కిలోమీటర్ల మేర మైలేజ్ ఇవ్వొచ్చు.
హోండా ఎస్పీ 125 కూడా తక్కువ ధరలోనే లభిస్తోంది. ఇది కూడా రెండు వేరియంట్ల రూపంలో కస్టమర్లకు లభిస్తోంది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ. 84 వేల నుంచి ఉంది. ఇందులో కూడా 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. ఈ బైక్ మైలేజ్ 60 కిలోమీటర్లుగా ఉండొచ్చు.
టీవీఎస్ రైడర్ కూడా చౌక ధరల బైక్స్ జాబితాలో ఉంది. ఈ బైక్ ధర రూ. 85 వేల నుంచి ఉంది. అదిరిపోయే లుక్‌తో ఈ బైక్ దుమ్మురేపుతోంది. ఇతర మోడళ్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ బైక్ లీటరుకు 67 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వొచ్చు.
కాగా మైలేజ్ అనేది బైక్ మెయింటెనెన్స్, రోడ్లు, డ్రైవింగ్ స్టైల్ వంటి పలు అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఒకే బైక్ ఒకరికి ఒక రకమైన మైలేజ్ అందిస్తే.. మరొకరికి మరో రకమైన మైలేజ్‌ను అందిస్తూ ఉంటాయి. అందువల్ల బైక్ కొనాలని భావించే వారు ఇప్పటికే ఆ బైక్ కొన్న వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ఉత్తమం.
కంపెనీలు పేర్కొనే మైలేజ్‌కు ఆన్‌రోడ్ మైలేజ్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో కంపెనీలు మైలేజ్‌ను లెక్కిస్తాయి. అందువల్ల ఆన్ రోడ్‌పై మైలేజ్ మారుతుంది. అందువల్ల మైలేజ్ బైక్స్ కొరుకునే వారు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.