Electric Scooter | బిగాస్ బీజీ డీ15 సిరీస్ మార్కెట్లోకి వచ్చింది. ఈ స్కూటర్లో 20 సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయని కంపెనీ పేర్కొంటోంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ స్కూటర్ 115 కిలోమీటర్లు వెళ్తుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, కీలెస్ స్టార్ట్, ఇన్‌బిల్డ్ నావిగేషన్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇసైకిల్ బ్రాండ్ ఇమోటోరాడ్ కూడా కొత్త ప్రొడక్టులను తెచ్చింది. లిల్ ఇ అండ్ టీ రెక్స్ ప్లస్ అనే మోడళ్లు లాంచ్ చేసింది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు.
అల్ట్రావాయిలెట్ ఆటోమొటివ్ కూడా సూపర్ బైక్‌ను లాంచ్ చేసింది. దీని పేరు అల్ట్రా వాయిలెట్ ఎఫ్77. ఈ ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ 307 కిలోమీటర్లు. ఈ బైక్ టాప్ స్పీడ్ గంటకు 150 కిలోమీటర్లు. ఫాస్ట్ చార్జర్‌తో ఒక గంటసేపు చార్జింగ్ పెడితే 75 కిలోమీటర్లు వెళ్లొచ్చు.
లోన్కిన్ రియల్ 5టీ ఎలక్ట్రిక్ బైక్ కూడా మార్కెట్లోకి వచ్చింది. దీని టాప్ స్పీడ్ గంటకు 115 కిలోమీటర్లు. ఇది 125 సీసీ స్కూటర్‌కు సమానమైన శక్తిని కలిగి ఉంటుంది. ఈ బైక్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 240 కిలోమీటర్ల వరకు వెళ్తుంది.
ఐవూమి కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు తెచ్చింది. ఐవోమి ఎనర్జీ మోడల్‌ను లాంచ్ చేసింది. దీని టాప్ స్పీడ్ గంటకు 60 కిలోమీటర్లు. ఒక్కసారి చార్జింగ్ పెడితే 130 కిలోమీటర్లు వెళ్తుంది. అలాగే ఐవూమి ఎస్1 మోడల్ కూడా ఉంది. ఇది 115 కిలోమీటర్లు వెళ్తుంది.
జాయో ఇబైక్ కూడా మూడు మోడళ్లను లాంచ్ చేసింది. వూల్ఫ్ ప్లస్, జెన్ నెక్ట్స్ నాను ప్లస్, డెల్ గో వంటి మోడళ్లు తెచ్చింది. వీటి రేంజ్ 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. టాప్ స్పీడ్ గంటలకు 55 కిలోమటర్లు.
రోలే కంపెనీ కూడా మార్స్, ప్లాటినా, పోష్ అనే మూడు మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. వీటి ధర రూ. 66 వేల నుంచి ప్రారంభం అవుతోంది. ఇవి 90 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను కలిగి ఉన్నాయి. వీటి టాప్ స్పీడ్ గంటకు 25 కిలోమీటర్లు.
ఎన్ఐజే ఆటోమోటిక్ కంపెనీ అసెలెరో ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. దీని రేంజ్ 190 కిలోమీటర్లు. ఎకో మోడ్‌లో ఈ రేంజ్ లభిస్తుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్ లైట్స్, స్పీడో మీటర్, యూఎస్బీ చార్జింగ్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి.
గ్రేటా కంపెనీ గ్లిండ్ పేరుతో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ తెచ్చింది. ఈ స్కూటర్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 100 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. ఇందులో డీఆర్ఎల్, ఈబీఎస్, ఏటీఏ సిస్టమ్స్, స్మార్ట్ షిఫ్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కీలెస్ స్టార్ట్, యాంటీ థెఫ్ట్ అలారం వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి.
స్విచ్ బైక్ కూడా లైట్ ఎక్స్ఈ పేరుతో కొత్త బైక్‌ను తెచ్చింది. ఇది ఫోల్డింగ్ బైక్. దీని రేటు రూ. 74,999. ఒక్కసారి చార్జింగ్ పెడితే 80 కిలోమీటర్లు వెళ్లొచ్చు. ఇందులో ఎల్సీడీ డిజిటల్ డిస్ప్లే, ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినింయ ఫ్రేమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఎంఎక్స్ఈ మోడల్ కూడా ఉంది. దీని రేంజ్ 120 కిలోమీటర్లు.
ప్యూర్ ఈవీ ఎట్రిస్ట్ 350 మోడల్‌ను లాంచ్ చేసింది. ఇది కంపెనీ ఫ్లాగ్షిప్ మోటార్‌సైకిల్. ఒక్కసారి చార్జింగ్ పెడితే 140 కిలోమీటర్లు వెళ్లొచ్చు. టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. ఐదేళ్ల వారంటీ ఉంటుంది.
ఓక్సో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ కూడా ఓక్సో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ లాంచ్ చేసింది. ఇది రెండు వేరియంట్ల రూపంలో ఉంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్లు వెళ్లొచ్చు. 25 పైసలు ఖర్చుతో ఒక కిలోమీటర్ వెళ్లొచ్చని కంపెనీ పేర్కొంటోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 90 కిలోమీటర్లు.