హోమ్ /వార్తలు /uncategorized /

Telangana: పొంగులేటి చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ

Telangana: పొంగులేటి చేరికపై వైఎస్ షర్మిల క్లారిటీ

పొంగులేటి చేరికపై షర్మిల కీలక వ్యాఖ్యలు

పొంగులేటి చేరికపై షర్మిల కీలక వ్యాఖ్యలు

YSRTP పార్టీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై వైఎస్ షర్మిల (Ys Sharmila) క్లారిటీ ఇచ్చారు. లోటస్ పాండ్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి భేటీ నిజమే. ఆయన పార్టీ చేరికపై నాకు క్లారిటీ ఇచ్చారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

YSRTP పార్టీలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై వైఎస్ షర్మిల (Ys Sharmila) క్లారిటీ ఇచ్చారు. లోటస్ పాండ్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి భేటీ నిజమే. ఆయన పార్టీ చేరికపై నాకు క్లారిటీ ఇచ్చారు. ఏ సమయంలో ఏది జరగాలో అదే జరుగుతుంది. ఏ సమయంలో చేరికలు ఉండాలో అప్పుడే ఉంటాయని ఆమె చెప్పుకొచ్చారు. పొంగులేటి తమ పార్టీలో చేరతారని తనకు మాటిచ్చాడని షర్మిల అన్నారు. YSRTP అధినేత్రి వైఎస్ షర్మిలతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల భేటీ అయ్యారనే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని పొంగులేటి అనుచరులు ఖండించారు. అయితే తాజాగా వైఎస్ షర్మిల పొంగులేటి భేటీపై పూర్తి స్పష్టత ఇచ్చారు.

Telangana Budget: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం..6న బడ్జెట్ సహా కీలక పరిణామాలు ఇలా..

కేసీఆర్ కు షర్మిల సవాల్..

ఇవాళ్టి నుంచి షర్మిల (Ys Sharmila) పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల (Ys Sharmila) ఫైర్ అయ్యారు. నాతో కలిసి సీఎం కేసీఆర్ ఒక్కరోజు పాదయాత్ర చేయాలి. ఒకవేళ సమస్యలు లేకపోతే నేను ముక్కు నేలకు రాస్తా. సమస్యలు ఉంటే కేసీఆర్ (Cm Kcr) తన పదవికి రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని సవాల్ విసిరారు. ఇక కేసీఆర్ కు షూ కూడా తీసుకున్న..నాతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలి. షూ సైజు సరిపోకుంటే రిటర్న్ ఆప్షన్ కూడా ఉందన్నారు.

Hyderabad Fire Accident: హైదరాబాద్ లో మరో భారీ అగ్నిప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

కాగా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పార్టీ నుంచి ఖమ్మం ఎంపీగా గెలిచారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్‌లో చేరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిగా, వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీగా పొంగులేటికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు షర్మిలతోనూ ఇప్పటికీ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. మరోవైపు పొంగులేటి బీజేపీలో చేరుబోతున్నారని.. ఫిబ్రవరిలో ఖమ్మంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించి.. కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారని తెలుస్తోంది.

కాగా బీఆర్ఎస్ పై తీవ్ర అసంతృప్తితో ఉన్న పొంగులేటి అధికార పార్టీకి గట్టి షాకిచ్చేలా నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో మొదట బీజేపీలో చేరుతారని ప్రచారం జరగగా..ఇప్పుడు షర్మిల పార్టీలోకి వెళతారని సమాచారం. మరి రానున్న రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

First published:

Tags: Khammam, Ponguleti srinivas reddy, Telangana, YS Sharmila

ఉత్తమ కథలు