బట్టల్ని మడత పెట్టే రోబో... 12 ఏళ్ల పిల్లాడి సృష్టి...

సృజనాత్మకతకూ చదువుకీ సంబంధం లేదేమో. ఆ చిన్నారి తయారుచేసిన రోబోని చూస్తే... భలే చేశాడే అనిపించకమానదు.

Krishna Kumar N | news18-telugu
Updated: July 6, 2019, 6:30 AM IST
బట్టల్ని మడత పెట్టే రోబో... 12 ఏళ్ల పిల్లాడి సృష్టి...
బట్టల్ని మడతపెట్టే రోబో (Image : Twitter / Reuters)
  • Share this:
అదో సాదాసీదా రోబో. బట్టల్ని మాత్రం క్షణాల్లో మడతపెట్టేస్తుంది. ఏదైనా డ్రెస్, టీ షర్ట్ లాంటిది దానికి ఇచ్చామంటే చాలు... మూడు సెకండ్లలో మడతపెట్టేస్తుంది. నైజీరియాకు చెందిన 12 ఏళ్ల చిన్నారి దాన్ని తయారుచేశాడు. నైజీరియన్లు ఎక్కువగా టీ-షర్టులు వాడతారు. ఆ లాండ్రీలో చిన్నారి తల్లి... వీకెండ్స్‌లో వాటిని మడత పెట్టేందుకు ఇబ్బంది పడటం చూశాడు. అమ్మకు సాయంగా ఏదైనా చేయాలనుకున్నాడు. ఆ క్షణంలో తయారుచేసినదే ఆ రోబో. జస్ట్ పిన్స్, చిన్న లైట్లు, ఈవీ3 బ్రిక్స్ వంటి వాటితోనే దాన్ని తయారుచేశాడు. ఈ రోబో... జపనీస్ తయారుచేసేంత అద్భుతమైన రోబో కాకపోవచ్చు. బట్ ఓ చిన్న ఆలోచనే... రేపు మరో పెద్ద ఆవిష్కరణకు నాంది పలకగలదు. అందువల్ల ఈ రోబోను తయారుచేసిన చిన్నారికి నెటిజన్లు హాట్సాప్ చెబుతున్నారు.

Published by: Krishna Kumar N
First published: July 6, 2019, 6:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading