MLA Mekapati: గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ (YCP Cleensweep) చేసిన జిల్లాల్లో నెల్లూరు ఒకటి.. కానీ ఇప్పుడు నెల్లూరులో పరిస్థితి మారింది. ఒకే పార్టీకి చెందిన నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు.. మొన్నటి వరకు అదే పార్టీలో ఉన్న నేతలపై.. ఎమ్మెల్యే ఎన్నికల తరువాత.. పార్టీ నుంచి బహిష్కరించింది. అప్పటి నుంచి స్థానిక వైసీపీ నేతలు వర్సెస్ రెబల్ ఎమ్మెల్యేలుగా పరిస్థితి మారింది. ముఖ్యంగా నెల్లూరు (Nellore District) లోని ఉదయగిరిలో టెన్షన్ టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. నీ ప్రతాపము.. నా ప్రతాపము చూసుకుందాం రా అంటూ సవాళ్లు విసురుకున్నారు. సై అంటే సై అంటూ ఛాలెంజ్ లు చేసుకున్నారు. దీంతో ఈ రోజు ఏం జరుగుతుంది అని ఉత్కంఠ పెరిగింది. పోలీసులు సైతం భారీగా మోహరించారు. అదే సమయంలో రెబల్ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (Rebel MLA Mekapati Chandra Sekhar Reddy) అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు మర్రి పాడులోని తన నివాసంలో వైద్యులు చికిత్స చేశారు. తరువాత మర్రిపాడు నుంచి చికిత్స కోసం నెల్లూరులోని ఆసుపత్రికి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. అక్కడ నుంచి చెన్నైకు తరలించారు.
అంతకుముందు ఛాలెంజ్ పై స్పందించాలని మేకపాటిని మీడియా కోరగా.. తనకు ఆరోగ్యం సరిగా లేదని.. ఇప్పుడేమీ మాట్లాడలేనని మీడియాకు చెప్పారు. తన అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజకీయాల్లోకి రావడానికి తానే కారణమన్నారు. ఉదయగిరిలో జరుగుతున్న పరిణామాలకు తన అన్న మేకపాటి రాజమోహన్ రెడ్డే కారణమన్నారు. కానీ ప్రస్తుతం తన అనారోగ్యం వల్ల ఏమి మాట్లాడలేకపోతున్నాను అన్నారు.
ఇప్పటికే తనకు మూడు స్టంట్లు వేశారని.. రాత్రి కూడా నొప్పి వచ్చిందన్నారు. గుండెనొప్పి రావడంతో చెన్నైకు తరలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఆయనకు గుండెపోటు వచ్చిన సంగతి తెలిసిందే అన్నారు. వెంటనే ఆయన్ను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. డాక్టర్లు పరీక్షలు నిర్వహించిన చంద్రశేఖర్‌రెడ్డి గుండెలో రెండు వాల్వులు బ్లాక్ అయినట్లు గుర్తించారు. ఆయన్ను మెరుగైన చికిత్స కోసం చెన్నై ఆస్పత్రికి తరలించారన్నారు. అక్కడ చంద్రశేఖర్ రెడ్డి కోలుకున్నారు.
ఇదీ చదవండి : జగన్ ను ఢీ కొడుతున్న రెబల్ ఎమ్మెల్యేలు.. రాజకీయ సునామి తప్పదంటూ వార్నింగ్..
ఇదిలా ఉండగా.. మరోవైపు ఉదయగిరి రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత మాటల యుద్ధం కొనసాగుతోంది. రెండు మూడు రోజులుగా సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. చంద్రశేఖర్ రెడ్డిని ఉదయగిరిలో అడుగు పెట్టనివ్వం.. తరిమేస్తామంటూ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు హెచ్చరించారు. దీంతో గురువారం సాయంత్రం మేకపాటి నేరుగా ఉదయగిరి బస్టాండ్ దగ్గరకు వెళ్లారు.. రోడ్డుపై కుర్చీ వేసుకుని మరీ కూర్చున్నారు. ఎవరో ఉదయగిరికి వస్తే తరుముతామన్నారని.. వాళ్లెవరో ఇప్పుడు రావాలంటూ సవాల్ చేశారు.
ఇదీ చదవండి : వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది..? కేంద్రం చేతిలో కీలక రిపోర్ట్..
ఆస్పత్రికి వెళ్లే ముందు మేకపాటి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యం కుదుటపడితే రాజకీయాల్లో ఉంటానని.. లేదంటే కూతురును చదివించుకుంటానన్నారు. ప్రభుత్వం ఉందని ఏ ఆటలైనా ఆడుకుంటారని.. తనకు తన ప్రజలు ఉన్నారన్నారు. ఉదయగిరి ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆయన అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.