ఉద్దానం విషయంలో... పవన్ కల్యాణ్‌‌పై వైసీపీ సెటైర్లు

ఉద్ధానం చుట్టూ అద్దె విమానాల్లో ఎగిరిన వ్యక్తి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడలేక కళ్లు మూసుకున్నాడని .. పవన్‌ను ఉద్దేశిస్తూ సెటైర్లు చేశారు.

news18-telugu
Updated: September 8, 2019, 12:45 PM IST
ఉద్దానం విషయంలో... పవన్ కల్యాణ్‌‌పై వైసీపీ సెటైర్లు
పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో
  • Share this:
మరోసారి వైసీపీ ప్రతిపక్షాలపై విమర్శలందుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. ఈ సారి ఉద్దానం అంశంపై పవన్‌ను టార్గెట్ చేశారాయన. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే విజయసాయిరెడ్డి ఈసారి పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకున్నారు. ఏపీ ప్రభుత్వం ఉద్ధానంలో 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్ధానం చుట్టూ అద్దె విమానాల్లో ఎగిరిన వ్యక్తి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడలేక కళ్లు మూసుకున్నాడని .. పవన్‌ను ఉద్దేశిస్తూ సెటైర్లు చేశారు.

ఉద్దానంలో త్వరలోనే 200 పడకల ఆసుపత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అందుబాటులోకి రాబోతోందని చెప్పారు. మెట్రోలలో తప్ప రాష్ట్రాల రాజధానుల్లో కూడా ఇలాంటి లేని సదుపాయం లేదంటూ ఆయన కొనియాడారు. ఈ ఆలోచన జగన్ ఉక్కు సంకల్పం నుంచి పుట్టుకొచ్చిందన్నారు.అంతే తప్ప ‘గాలి’ మాటల నుంచి కాదంటూ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.


Published by: Sulthana Begum Shaik
First published: September 8, 2019, 12:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading