హోమ్ /వార్తలు /uncategorized /

Botsa on Pawan: పవన్‌కు-పాల్‌కి తేడా లేదు..? విశాఖకు రాజధాని తరలింపుపై మంత్రి బొత్స క్లారిటీ

Botsa on Pawan: పవన్‌కు-పాల్‌కి తేడా లేదు..? విశాఖకు రాజధాని తరలింపుపై మంత్రి బొత్స క్లారిటీ

పవన్ పై బొత్స  ఫైర్

పవన్ పై బొత్స ఫైర్

Botsa on Pawan: మంత్రి బొత్స సత్యన్నారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. పవన్ ను కేఏ పాల్ తో పోల్చారు.. అలాగే విశాఖకు రాజధాని తరలింపుపైనా క్లారిటీ ఇచ్చారు.. ఆయన ఏమన్నారంటే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Botsa on Pawan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా ఏపీ లో అధికార వైసీపీ, విపక్ష జనసేన మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా మంత్రులు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. అయితే పవన్ కు చెందిన సమాజిక వర్గానికే చెందిన మంత్రులు పదే పదే పవన్ ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆయా మంత్రుల జాబితాలో చూస్తే పవన్ మంత్రి బొత్స విమర్శించేది తక్కువే..? ఎప్పుడో కాని పవన్ పెద్దగా తిట్టరు. అయితే తాజాగా పవన్ పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం ఏపీలో పొత్తుల వ్యవహారంలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై చర్చ పెరుగుతోంది. పవన్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే పవన్‌ వర్సెస్‌ వైసీపీ నాయకులు అన్నట్లు పరిస్థితులు మారాయి. ఈ క్రమంలోనే బొత్స కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

తాజాగా పవన్ చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ నేతలకు వార్నింగ్ లా మారుతున్నాయి. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి అంటూ పవన్‌ చేసిన కామెంట్లపై మంత్రి బొత్స సత్యనారాయణ ఘూటుగా స్పందించారు. రాజకీయాల్లో కేఏపాల్‌కి, పవన్‌కి తేడా కనిపించడం లేదంటూ సెటైర్లు విసిరారు. పవన్ వ్యాఖ్యలు చూస్తుంటే పిచ్చెక్కినట్టు ఉన్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

రిపబ్లిక్ డే రోజున ఎవరైనా హుందాగా మాట్లాడతారు. కానీ ఆ సెలబ్రిటీ పార్టీ నాయకుడు సన్నాసి మాటలు మాట్లాడడమే కాకుండా.. తమ చేత కూడా.. మాట్లాడిస్తున్నాడు అంటూ మండిపడ్డారు. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఉగ్రవాది అయిపోతే… చట్టం తన పని తాను చేసుకుని పోతుందన్నారు. ఎవరిని కొడతాడు? ఎవరిని బెదిరిస్తాడు? డీబీటీ ద్వారా 60 వేల కోట్లు ఇచ్చాం అన్నారు. అణగారిన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడితే పవన్ కళ్యాణ్ కు బాధ ఏంటని ప్రశ్నించారు. వాక్ స్వాతంత్రం ఉందని ఇలా మాట్లాడటం కరెక్టేనా? ఈ భాష ద్వారా వచ్చే తరాలకు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నారని మంత్రి ప్రశ్నించారు.?

పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక పెద్ద బండి కొనుక్కుని ఉంటాడు. ఏముంది దాంట్లో?? దీనికి సన్నాసి, పనికి మాలిన మాటలు ఎందుకు. ఇలాంటి వాళ్ళను చూస్తుంటే రాజకీయాలు అంటేనే విరక్తి వస్తోంది అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ది దోపిడి విధానం, మాది అభివృద్ధి విధానం. అలాగే మూడు రాజధానుల విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. మూడు రాజధానులు మా విధానం అన్నారు. ఇంతకు ముందూ చెప్పాం… మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాకు చిత్తశుద్ధి, ప్రేమ ఉండవా?కైకై అని అరిచి మాట్లాడితే ప్రేమ ఉన్నట్లా??విశాఖ రాజధాని పై బొత్స కీలక వ్యాఖ్యలు. కొత్త సంవత్సరాది నుంచి విశాఖ నుంచి పాలన ప్రారంభించాలని.. తాము ముఖ్యమంత్రి పై ఒత్తిడి చేస్తున్నాం. కేబినెట్ మంత్రులు అడిగితే ముఖ్యమంత్రి కుదరదు అనరుగా. సానుకూలంగా స్పందిస్తారన్నారు.

ఇక పొత్తులపై పవన్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి స్పందించారు. ఇంతకీ సీఎం అభ్యర్థి ఎవరో తేల్చండి అంటూ సజ్జల సూటిగా ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి తాను ఇన్ని సీట్లలో పోటీచేస్తానని.. పవన్‌ ఎందుకు చెప్పడం లేదని.. సజ్జల ప్రశ్నించారు. పొత్తుల గురించి మూడు ఆప్షన్లు చెప్పిన పవన్‌.. మరి నాలుగో ఆప్షన్‌ మరిచిపోయారా? అని ప్రశ్నించారు. 2014 మాదిరిగా చంద్రబాబుకు సపోర్టు చేస్తామని ఎందుకు చెప్పలేకపోయారని నిలదీశారు.

First published:

ఉత్తమ కథలు