news18-telugu
Updated: December 8, 2019, 7:36 PM IST
డుప్లెసిస్ (File Photo)
టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లను జట్టులో ఏమైనా మార్పులు ఉన్నాయా? అని మ్యాచ్ ప్రెజెంటర్ ప్రశ్నించడం సాధారణం.ఉంటే ఉన్నాయనో.. లేదంటే లేదనో ఇలాంటి ప్రశ్నలకు కెప్టెన్స్ బదులివ్వడం పరిపాటి. కానీ సౌతాఫ్రికా క్రికెటర్ డుప్లెసిస్ మాత్రం మైండ్ బ్లాంక్ అయ్యే సమాధానం చెప్పాడు. అతని సమాధానానికి మ్యాచ్ ప్రెజెంటర్ పగలబడి నవ్వేశాడు.
ఇంతకీ అసలు విషయమేంటంటే.. ఇండియాలో ఐపీఎల్ లాగే సౌతాఫ్రికాలో ప్రతీ ఏటా మాన్షీ లీగ్ జరుగుతుంది. ఈ లీగ్‌లో పార్ల్ రాక్స్ టీమ్‌కి డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా నెల్సన్ మండేలా టీమ్, పార్ల్ రాక్స్ టీమ్‌కి మధ్య మ్యాచ్ జరిగింది.మ్యాచ్‌కి ముందు టాస్ సమయంలో.. ఎప్పటిలాగే మ్యాచ్ ప్రెజెంటర్ డుప్లెసిస్‌ను 'జట్టులో ఏమైనా మార్పులు ఉన్నాయా..?' అని ప్రశ్నించాడు. దానికి డుప్లెసిస్.. 'అవును ఈ మ్యాచ్‌లో విల్జోయెన్ ఆడట్లేదు. ఎందుకంటే ఇప్పుడతను నా చెల్లెలితో బెడ్‌పై ఉండి ఉంటాడు. నిన్ననే వారిద్దరికీ వివాహమైంది.'అని చెప్పాడు. డుప్లెసిస్ నుంచి వచ్చిన ఈ సమాధానానికి ఒకింత ఆశ్చర్యంతో పాటు పగలబడి నవ్వాడు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Published by:
Srinivas Mittapalli
First published:
December 8, 2019, 6:58 PM IST