Valentines Day 2021: మీ ప్రేయసికి వాలెంటైన్ డే రోజు ఏం గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా...ఇది మీ కోసం..

ప్రతీకాత్మకచిత్రం

మనసులో ప్రేమను బయటపెట్టాలనుకునే వాళ్లకు కూడా వాలెంటైన్స్​​ డే ఎంతో ఎంతో స్పెషల్. ఈ స్పెషల్‌‌డే రోజు ప్రేమను వ్యక్తపరచడానికి టైమ్ లెస్ కానుకలు ఇవ్వాలని కవులు, రచయితలు చెబుతుంటారు. అలాంటి వాటిలో బంగారం మొదటి స్థానంలో ఉంటుంది.

  • Share this:
    మనసులో ప్రేమను బయటపెట్టాలనుకునే వాళ్లకు కూడా వాలెంటైన్స్​​ డే ఎంతో ఎంతో స్పెషల్. ఈ స్పెషల్‌‌డే రోజు ప్రేమను వ్యక్తపరచడానికి టైమ్ లెస్ కానుకలు ఇవ్వాలని కవులు, రచయితలు చెబుతుంటారు. అలాంటి టైం లెస్ కానుకల్లో ముందు స్థానంలో ఉండేది బంగారం అనే చెప్పాలి. బంగారు నగలకు బహుమతులలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక భారతీయ మహిళలకు ఎలాగో నగలపై మోజెక్కువే. పండగ.. పెళ్లి.. ఉత్సవమేదైనా వారికి ఆభరణమే ప్రధాన అలంకరణగా ఉన్నాయి. దేశంలోని 60 శాతం నారీమణులు ఇప్పటికే బంగారు ఆభరణాలు కలిగి ఉన్నారని డబ్ల్యూజీసీ తాజా సర్వే నివేదిక వెల్లడించింది. గోల్డ్‌ జువెలరీకి భారత్‌ కీలక మార్కెట్‌ అని రిపోర్టు పేర్కొంది. ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమకు, కానుకలకు విడదీయలేని బంధం ఉంది. కానుకల్లో బంగారు ఆభరణాలు ఎప్పుడూ ప్రత్యేకమే. అయితే వాలెంటైన్ డే రోజు గిఫ్ట్‌‌గా బంగారంతో పాటు వజ్రపు రింగ్, లేదంటే చిన్న గొలుసు లాంటివి ఇవ్వొచ్చు. కేవలం బంగారు నగలే కాదు. సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా మంచి డిజైన్స్ తో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

    ఆన్ లైన్ లో కూడా ఎన్నో రకాల వెరైటీ ఆభరణాలు దొరుకుతున్నాయి. కొన్ని జువెలరీ షాపులు కస్టమైజ్డ్ జువెలరీని కూడా అందిస్తున్నాయి. ట్రెండ్‌‌కి తగ్గట్టు కొత్తగా ఉండే జువెలరీని డిజైన్ చేయించి గిఫ్ట్‌‌గా ఇవ్వొచ్చు. అమ్మాయిలు అబ్బాయిలకు బ్రేస్‌‌లెట్, రింగ్ లాంటివి బహుమతిగా ఇవ్వొచ్చు. ఆన్ లైన్ లో కూడా బంగారు ఆభరణాలు పంపేందుకు అటు పలు ఈ కామర్స్ సైట్స్ ముందుకు వచ్చాయి.
    Published by:Krishna Adithya
    First published: