హోమ్ /వార్తలు /uncategorized /

Buchi Babu Sana: మహేష్ బాబు ఇంటికి వెళ్లినప్పుడు నమ్రత అలా చేసేస‌రికి ఆశ్చ‌ర్య‌పోయా.. ఉప్పెన ద‌ర్శ‌కుడు

Buchi Babu Sana: మహేష్ బాబు ఇంటికి వెళ్లినప్పుడు నమ్రత అలా చేసేస‌రికి ఆశ్చ‌ర్య‌పోయా.. ఉప్పెన ద‌ర్శ‌కుడు

Buchi Babu Sana: టాలీవుడ్‌లో ఈ నెల‌లో విడుద‌ల కాబోతున్న మంచి హైప్ ఉన్న చిత్రాల్లో ఉప్పెన ఒక‌టి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించిన‌ ఈ చిత్రం ద్వారా వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అవుతున్నారు. కోలీవుడ్ స్టార్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించారు.

ఇంకా చదవండి ...

  Buchi Babu Sana: టాలీవుడ్‌లో ఈ నెల‌లో విడుద‌ల కాబోతున్న మంచి హైప్ ఉన్న చిత్రాల్లో ఉప్పెన ఒక‌టి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌కుడిగా మారి తెర‌కెక్కించిన‌ ఈ చిత్రం ద్వారా వైష్ణ‌వ్ తేజ్, కృతి శెట్టి టాలీవుడ్‌కి ప‌రిచ‌యం అవుతున్నారు. కోలీవుడ్ స్టార్ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టించారు. మైత్రీ మూవీ మేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్‌, పాట‌లు అంద‌రినీ ఆక‌ట్టుకోగా.. ఈ మూవీపై అటు మెగాభిమానులే కాకుండా ఇటు సాధార‌ణ ప్రేక్ష‌కులు సైతం అంచ‌నాల‌ను పెట్టుకున్నారు. ఇక మ‌రో రెండు రోజుల్లో ఈ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ ప్ర‌మోష‌న్ల‌లో మాట్లాడిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు.

  ఎన్టీఆర్‌కి తాను పెద్ద అభిమానిని అని.. నాన్న‌కు ప్రేమతో షూటింగ్ స‌మ‌యంలో ఆయ‌నతో బాగా క‌నెక్ట్ అయ్యాన‌ని.. ఆ స‌మ‌యంలో ఒక క‌థ‌ను కూడా చెప్పాన‌ని అన్నారు. ఆ క‌థ‌ను విన్న ఎన్టీఆర్..నిజం చెప్పు ఈ స్టోరీని ఎవ‌రి ద‌గ్గ‌ర దొబ్బేశావు అని అన్నార‌ని.. అంటే ఆ క‌థ‌లో కొత్త‌ద‌నం ఎన్టీఆర్‌కి బాగా న‌చ్చింద‌ని అన్నారు. అంతేకాదు ఉప్పెన షూటింగ్ జ‌రిగే స‌మ‌యంలో ప‌లుమార్లు ఫోన్ చేసి సినిమా ఎలా వ‌స్తుంది అని అడిగేవార‌ని చెప్పుకొచ్చారు.

  ఇక రంగ‌స్థ‌లం సినిమా స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్‌తో మంచి ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని.. మ‌ధ్య మ‌ధ్య‌లో సెట్స్‌కి వ‌చ్చే మెగాస్టార్ చిరంజీవికి త‌మ‌ను ప‌రిచ‌యం చేశాడ‌ని చెప్పుకొచ్చారు. స్టార్ హీరోల్లో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌తో బాగా అనుబంధం ఏర్ప‌డింద‌ని తెలిపారు. ఇక‌ ఉప్పెన షూటింగ్ స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ కూడా ఫోన్ చేసేవార‌ని వెల్ల‌డించారు.

  ఇక మ‌హేష్ బాబుతో సుకుమార్ 1 నేనొక్క‌డినే సినిమా తీసే స‌మ‌యంలో తాము ఒక‌సారి ఆయ‌న ఇంటికి వెళ్లామ‌ని.. అప్పుడే సితార పుట్టింద‌ని.. ఆ స‌మ‌యంలో చాలా క్యూట్‌గా ఉంద‌ని మేము అన‌గా.. వెంట‌నే న‌మ్ర‌త‌, సితార‌ను త‌మ చేతిలో పెట్టార‌ని గుర్తు చేసుకున్నారు. నిజానికి చెప్పాలంటే మేము ఎక్క‌డెక్క‌డో తిరిగి వ‌చ్చి ఉంటాము. కానీ అవేమీ ప‌ట్టించుకోకుండా త‌మ బిడ్డ‌ను చూసేందుకు మా చేతిలో పెట్టారు. గొప్పోళ్లు ఊరికే గొప్పోళ్లు అవ్వ‌రు అని బుచ్చిబాబు చెప్పుకొచ్చారు. ఇక ఉప్పెన క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు.

  First published:

  Tags: Jr ntr, Mahesh Babu, Namrata, Ram Charan, Uppena

  ఉత్తమ కథలు