ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు..కుల వివక్ష బాధలు ఆయనకు తెలియవు

UP Lok Sabha Election 2019 | ప్రధాని నరేంద్ర మోదీ పుట్టుకతో ఓబీసీ కారని ఆరోపించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి, కుల వివక్ష బాధలు ఆయనకు తెలియవని వ్యాఖ్యానించారు. మోదీ గుజరాత్ సీఎం అయ్యాక తమ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారని ఆమె గుర్తుచేశారు.

news18-telugu
Updated: May 10, 2019, 1:14 PM IST
ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు..కుల వివక్ష బాధలు ఆయనకు తెలియవు
నరేంద్ర మోదీ, మాయావతి
  • Share this:
ప్రధాని నరేంద్ర మోదీ కుల అంశాన్ని మరోసారి లేవనెత్తారు బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ మాయావతి. పుట్టుకతో నరేంద్ర మోడీ ఓబీసీ కారని ఆమె స్పష్టంచేశారు. కుల వివక్ష వేధింపులు మోదీ ఎదుర్కోలేదని వ్యాఖ్యానించారు. సమాజ్‌వాది పార్టీ-బీఎస్పీ కూటమి కుల ప్రాతిపదికన ఏర్పాటైందంటూ ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రధాని మోదీ అపరిపక్వతతో ఈ వ్యాఖ్యలు చేశారని ఎద్దేవా చేశారు. కులవివక్షకు గురైన బాధితులకు కులతత్వాన్ని అంటగట్టడం సరికాదంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మాయావతి విరుచుకపడ్డారు.

ప్రధాని మోదీ పుట్టికతో ఓబీసీ కారని, కులతత్వంపై ప్రధాని మోదీ మాట్లాడకుండా ఉంటే మంచిదని సూచించారు. మోదీ గుజరాత్ సీఎం అయ్యాకే తమ కులాన్ని ఓబీసీలో చేర్చారని గుర్తుచేశారు. పుట్టుకతో ప్రధాని మోదీ ఓబీసీ అయితే, ఆయన్ను ఆర్ఎస్ఎస్ దేశ ప్రధానమంత్రి కానిచ్చేది కాదని వ్యాఖ్యానించారు. కల్యాణ్ సింగ్ వంటి నేతల విషయంలో ఆర్ఎస్ఎస్ ఏం చేసిందో అందరికీ తెలుసని మాయావతి పేర్కొన్నారు.


లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఒత్తిడితోనే బీజేపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలోకి రాబోదని, రెండోసారి ప్రధాని కావాలన్న ప్రధాని మోదీ కల నెరవేరబోదన్నారు. నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో దళితులు గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలేకపోతున్నారని విమర్శించారు. పెళ్లి వేడుకల్లో భాగంగా దళితులు గ్రామంలో గుర్రంపై ఊరేగేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. గుజరాత్‌లో దళితులు వేధింపులకు గురవుతున్నారని విమర్శించారు.
First published: May 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>