ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. 9న మిలియన్ మార్చ్‌కు పిలుపు..

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, డిమాండ్ల పరిష్కారానికి సమ్మెను ఉధృతం చేసే దిశగా ఈ నెల 9న మిలియన్ మార్చ్‌కు ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చారు. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.

news18-telugu
Updated: November 6, 2019, 3:57 PM IST
ఆర్టీసీ జేఏసీ కీలక నిర్ణయం.. 9న మిలియన్ మార్చ్‌కు పిలుపు..
అశ్వత్థామరెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆర్టీసీ సమ్మె 33వ రోజుకు చేరుకుంది. కార్మికులు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపును కాదని అంతా సమ్మెలోనే కొనసాగుతున్నారు. అక్కడక్కడా కొందరు డ్రైవర్లు, కండక్టర్లు మాత్రమే విధుల్లో చేరుతున్నారు. అయితే, సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, డిమాండ్ల పరిష్కారానికి సమ్మెను ఉధృతం చేసే దిశగా ఈ నెల 9న మిలియన్ మార్చ్‌కు పిలుపునిచ్చారు. ఈ మేరకు జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మిలియన్ మార్చ్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. అన్ని ఉద్యోగ సంఘాలు మిలియన్ మార్చ్‌కు మద్దతు తెలుపుతాయని భావిస్తున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘సీఎం కేసీఆర్ ఆదేశాలను ఏ ఒక్క ఆర్టీసీ కార్మికుడు కూడా లెక్క చేయలేదు. కొందర్ని విధుల్లో చేర్చాలని చూసినా, వాళ్లు తిరిగి సమ్మె బాట పట్టారు’ అని వివరించారు.

ప్రభుత్వ నిర్ణయాలకు ఎవ్వరూ భయపడవద్దని, ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కొందరు ఆర్టీసీ ప్రతినిధులు కలిసేందుకు వెళ్లారని అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే తప్ప జరగదని, ఎందుకంటే 30 శాతం వాటా కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు.

First published: November 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>