అందమైన పూలవనంలా ఉన్న దేశాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ లాంటి టార్చ్ బేరర్ ఈ దేశానికి అవసరమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ భారతదేశ ప్రగతికి బంగారు బాటలు వేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాలనే తీర్మానాన్ని కేటీఆర్(KTR) పార్టీ ఆవిర్భావ సభలో ప్రవేశపెట్టారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ(PM Modi) ప్రసంగాలు ఎంతో గొప్పగా ఉంటాయని.. కానీ ఆచరణలో మాత్రం ఏమీ ఉండదని కేటీఆర్ విమర్శించారు. ఆయన పాలనలో విద్వేషమే నాలుగు పాదాల మీద నుడుస్తోందని అన్నారు. కులపిచ్చి, మతపిచ్చి రేపుతున్న సంస్థల ఎజెండా, రెచ్చగొట్టే ఉద్వేగాలకు లోనవుదామా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం ఏడేళ్లలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదని కేటీఆర్ అన్నారు. ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం కావాలని ఆయన అన్నారు. తెలంగాణలో (Telangana) అమలవుతున్న వ్యసాయ అనుకూల పథకాలు దేశమంతా అమలు కావాలని ఆకాక్షించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదని.. గ్రోత్ ఇంజిన్ సర్కార్ కావాలని అన్నారు. గోల్మాల్ మోడల్, బుల్డోజర్ మోడల్, బిల్డప్ మోడల్ వద్దని.. గోల్డెన్ తెలంగాణ మోడల్ దేశానికి పరిచయం కావాలని కేటీఆర్ సూచించారు.
సోషల్ మీడియా ద్వారా సోషల్ ఫ్యాబ్రిక్‌ను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మేరా భరత్ మహాన్ అనే నినాదాన్ని సాకారం చేసే నాయకున్ని భారతదేశం కోరుకుంటోందని.. ఆ నాయకుడిని తెలంగాణ అందిస్తుందని మనసారా ఆకాంక్షిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారని.. కానీ మన తెలంగాణకు రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని కేటీఆర్ అన్నారు.
Bandi Sanjay: టీఆర్ఎస్ గద్దె దిగితేనే ప్రజలకు మేలు జరుగుతుంది..పాదయాత్రలో బండి సంజయ్ కామెంట్
KCR | TRS plenary: కేసీఆర్ సంచలనం.. జాతీయ అజెండా ప్రకటన.. భారత రాష్ట్ర సమితి (BRS)!
జీవితంలో లక్ష్యాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ అని నాడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ కొనియాడారని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ చావు నోట్లో తలపెట్టి ఈ రాష్ట్రాన్ని సాధించారని.. మంచి ఆందోళనకారులు మంచి పరిపాలకులుగా మారడం చాలా అరుదు అని.. అలాంటి అరుదైన వ్యక్తి కేసీఆర్ అని దివంగత అరుణ్ జైట్లీ అన్నారని కేటీఆర్ చెప్పారు. అలాంటి కేసీఆర్ నాయకత్వం దేశానికి అవసరమని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.