White kiwi bird: న్యూజిలాండ్‌లో చనిపోయిన అరుదైన పక్షి.. ఆపరేషన్లు చేసినా దక్కని ఫలితం

White kiwi bird: న్యూజిలాండ్‌లో చనిపోయిన అరుదైన పక్షి.. ఆపరేషన్లు చేసినా దక్కని ఫలితం

చనిపోయిన ఆ అరుదైన పక్షి ఇదే

న్యూజిలాండ్‌లో పక్షుల సంరక్షణ కేంద్రంలో పదేళ్లుగా పెంచుతున్న అరుదైన కివి (kiwi) పక్షి చనిపోయింది. మనుకుర (Manukura) అనే పేరున్న తెలుపు రంగు కివీ పక్షికి ఆ దేశంలో చాలా ప్రత్యేకతలున్నాయి. పిల్లల కథల పుస్తకాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది.

  • Share this:
న్యూజిలాండ్‌లో పక్షుల సంరక్షణ కేంద్రంలో పదేళ్లుగా పెంచుతున్న అరుదైన కివి (kiwi) పక్షి చనిపోయింది. మనుకుర (Manukura) అనే పేరున్న తెలుపు రంగు కివీ పక్షికి ఆ దేశంలో చాలా ప్రత్యేకతలున్నాయి. పిల్లల కథల పుస్తకాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. స్థానిక తెగల ప్రజలు దాన్ని ఆరాధిస్తారు. అన్ని ప్రత్యేకతలున్న ఆ కివి పక్షి.. కడుపులో సరిగా అభివృద్ధి చెందని గుడ్డు కారణంగా అనారోగ్యానికి గురైంది. డాక్టర్లు ఆపరేషన్‌ చేసి, మెరుగైన చికిత్స అందించినా దాని ప్రాణాలను కాపాడలేకపోయారు. ఈ నార్త్ ఐలాండ్ బ్రౌన్ కివి 2011లో పుకాహా నేషనల్ వైల్డ్ లైఫ్ సెంటర్‌ (Pūkaha National Wildlife Centre)లో పుట్టింది. సాధారణంగా న్యూజిలాండ్‌లో కివి పక్షులు గోధుమ రంగులో ఉంటాయి. కానీ అరుదైన జన్యులోపం కారణంగా దీని ఈకలు మాత్రం తెలుపురంగులో ఉన్నాయి. ఇంక్యుబేషన్‌లో పొదిగి, పుట్టిన మొట్టమొదటి వైట్ కివి బర్డ్‌గా ఇది గుర్తింపు పొందింది. దీంతో వైల్డ్‌ లైఫ్ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధతో దాన్ని పెంచారు.

గత 10 సంవత్సరాలుగా ఈ పక్షి ఎంతోమంది ప్రజలను మంత్ర ముగ్దుల్ని చేసిందని డిపార్ట్మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ వైరరపా (Department of Conservation Wairarapa) ఆపరేషన్స్ మేనేజర్ కాథీ హౌకామౌ చెప్పారు. మనుకుర పుట్టినప్పుడు ఆయన పుకాహ వైల్డ్‌లైఫ్ సెంటర్ మేనేజర్‌గా ఉన్నారు. గత కొన్నిరోజులుగా మనుకుర సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు. బరువు కూడా తగ్గినట్లు అనిపించడంతో డిసెంబర్ మొదటి వారంలో సంరక్షకులు దాన్ని బర్డ్స్‌ స్పెషలిస్టుల వద్దకు తీసుకెళ్లారు. అప్పుడే సమస్య బయటపడింది. కడుపులో సరిగ్గా అభివృద్ధి చెందని గుడ్డు వల్ల ఆ పక్షి అనారోగ్యానికి గురైంది. దీంతో స్పెషలిస్ట్‌ డాక్టర్లు ఆపరేషన్ చేసి ఆ గుడ్డును విజయవంతంగా తొలగించారు. కానీ అది కోలుకోవడానికి మరిన్ని ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. దీంతో దాని ఆరోగ్యం బాగా క్షీణించి చనిపోయిందని పుకాహ బర్డ్ పార్క్ జనరల్ మేనేజర్ ఎమిలీ కోర్ట్ వివరించారు.

అంతరించిపోతున్న కివి జాతి
తాము ఎంతో ప్రత్యేకంగా చూసుకుంటున్న మనుకుర చనిపోవడం బాధ కలిగించిందని పుకాహ వైల్డ్‌లైఫ్ సెంటర్ సిబ్బంది చెబుతున్నారు. తెలుపు రంగు కివి పక్షులు అడవిలో, చాలా అరుదుగా ఉంటాయి. ఇవి బయట ప్రపంచంలో కనిపించవు. న్యూజిలాండ్‌లో సుమారు 68,000 కివిలు మాత్రమే మిగిలి ఉన్నాయని అంచనా. వీటిలో ప్రతి సంవత్సరం కనీసం రెండుశాతం వరకు చనిపోతున్నాయి. కుక్కలు, పిల్లులు, ఫెర్రెట్స్ వంటి మాంసాహారులు వీటిని వేటాడుతున్నాయి.
Published by:Nikhil Kumar S
First published: