ఎగుమతుల్లో 1 ట్రిలియన్ డాలర్లు చేర్చడమే లక్ష్యం...నిర్మలా సీతారామన్

దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో భారత్ స్థానం మెరుగైందని పేర్కొంది. అలాగే రానున్న ఐదేళ్ల కాలంలో ఎగుమతులను ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

news18-telugu
Updated: September 14, 2019, 10:15 PM IST
ఎగుమతుల్లో 1 ట్రిలియన్ డాలర్లు చేర్చడమే లక్ష్యం...నిర్మలా సీతారామన్
నిర్మలా సీతారామన్ (Image : PTI)
  • Share this:
దేశ ఆర్థిక వ్యవస్థు ఎలాంటి ఢోకా లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మలా కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈ సందర్భంగా దేశంలో ఆర్థిక రంగం మెరుగుదల కోసం పలు సంస్కరణలతో పాటు చర్యలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని పేర్కొన్నారు. అంతే కాదు క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ వల్ల ప్రస్తుత మందగమన పరిస్థితి నుంచి వ్యవస్థ మెరుగుపడుతుందని నిర్మల తెలిపారు. అయితే 2019-20 తొలి త్రైమాసికంలో వృద్ధిరేటు ఆశించిన స్థాయిలోనే ఉందని ఆమె అన్నారు. అలాగే టెక్స్‌టైల్‌ రంగానికి మినహాయింపులతో పాటు పలు ప్రోత్సాహకాలు ఈ ఏడాది చివరి వరకు కొనసాగిస్తామని ఆమె తెలిపారు. అంతేకాదు ఎగుమతులపై పన్ను విషయంలో పునరాలోచన చేయనున్నట్లు తెలిపారు.

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పెరిగే సూచనలు ఉన్నాయని నిర్మలా అన్నారు. ఇక ప్రభుత్వ బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం పెరిగిందని, అలాగే బ్యాంకర్లతో సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ లో భారత్ స్థానం మెరుగైందని పేర్కొంది. అలాగే రానున్న ఐదేళ్ల కాలంలో ఎగుమతులను ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

First published: September 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>