హోమ్ /వార్తలు /uncategorized /

Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత డీఎస్..!

Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత డీఎస్..!

కాంగ్రెస్‌లో చేరిన డీఎస్

కాంగ్రెస్‌లో చేరిన డీఎస్

హైదరాబాద్ గాంధీభవన్‌‌లో జరిగిన ఈ కార్యక్రమానికి... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు హాజరయ్యారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ సీనియర్‌ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్‌ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్‌ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ గాంధీభవన్‌‌లో జరిగిన ఈ కార్యక్రమానికి... టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీహెచ్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు హాజరయ్యారు. డీఎస్‌కు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరికపై ట్విస్ట్‌ చోటుచేసుకుంది. కాంగ్రెస్‌లో చేరడం లేదంటూ ముందుగా డీఎస్‌ పేరుతో ఓ లేఖ విడులైంది. ఆ తర్వాత కాసేపటికే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు డీఎస్‌ స్వయంగా ప్రకటించారు. వీల్‌చైర్‌లో గాంధీ భవన్‌కు వచ్చిన డీఎస్‌.. ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

First published:

Tags: D Srinivas, Revanth Reddy, Telangana Politics, Tpcc

ఉత్తమ కథలు