ప్రస్తుతం ఎక్కువ మంది సెలక్ట్ చేసుకుంటున్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఫిక్స్డ్ డిపాజిట్లు. ఎలాంటి రిస్క్ లేకపోవడం, స్థిరమైన ఆదాయాన్ని అందించడం ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్‌లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. మార్కెట్ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా ఫిక్స్డ్ డిపాజిట్లు రాబడిని అందిస్తాయి. ఈ క్రమంలో ప్రజల నుంచి ఇన్వెస్ట్మెంట్లు రాబట్టేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ద్రవ్యోల్బణం ప్రభావంతో, ఆర్బీఐ రెపో రేటు పెంపుతో ఇతర లోన్ వడ్డీ రేట్లు పెరిగాయి. అయితే కొంతకాలంగా ప్రధాన బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు మెరుగైన వడ్డీని అందిస్తూ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం భారత అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. జనరల్ పబ్లిక్, సీనియర్ సిటిజన్స్, ఎన్ఆర్ఐల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను సవరించింది. ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్మెంట్లకు 6.9 శాతం వరకు హామీతో కూడిన రాబడిని అందిస్తోంది. అదే విధంగా ఎస్బీఐ స్టాఫ్, పెన్షనర్లకు వర్తించే రేట్ల కంటే అదనంగా 1.00 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. లేటెస్ట్ ఎస్బీఐ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
సవరించిన వడ్డీ రేట్లు ఇలా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సరం కాల వ్యవధికి చేసిన ఎఫ్డీలపై నాన్- సీనియర్ సిటిజన్లకు 6.1 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు 6.6 శాతం వడ్డీ రేటు పొందవచ్చు. ఐదు సంవత్సరాల కాల వ్యవధికి చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.1 శాతం వడ్డీని బ్యాంక్ అందిస్తోంది. అదే విధంగా సీనియర్ సిటిజన్లకు 6.9 శాతం వడ్డీరేటును ఆఫర్ చేస్తోంది.
ఎన్ఆర్ఐల వడ్డీ రేట్లు
ఒక సంవత్సరం కాలవ్యవధికి రూ.2 కోట్లలోపు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎన్ఆర్ఐలకు 6.1 శాతం వడ్డీని ఎస్బీఐ అందిస్తోంది. రూ.2 కోట్ల కంటే ఎక్కువ మొత్తాలకు 6 శాతం వడ్డీరేటును చెల్లిస్తోంది. ఐదు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల కాలవ్యవధికి చేసిన రూ.2 కోట్లలోపు ఎఫ్డీలపై 6.1 శాతం, రూ.2 కోట్ల కంటే ఎక్కువ మొత్తం ఎఫ్డీలపై 5 శాతం వడ్డీని ఎన్ఆర్ఐలు అందుకోవచ్చు.
ఒక సంవత్సరం రిటర్న్స్
ఇండియాలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్, ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్లో ఒక సంవత్సరానికి రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే 6.6 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ లెక్కన రూ.33,826 వడ్డీని అందుకోవచ్చు. మెచ్యూరిటీ మొత్తం రూ.5,33,826 అవుతుంది. అయితే ఈ మొత్తాన్ని ఐదేళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తే, మెచ్యూరిటీ మొత్తం రూ.5,35,403 అవుతుంది.
రూ.కోటి NRI డిపాజిట్‌పై రాబడి
NRI డిపాజిట్ల విషయంలో రాబడి రేటు 6.1 శాతంగా ఉంది. దీంతో ఎన్ఆర్ఐ ఒక సంవత్సరం లేదా ఐదేళ్లపాటు రూ.కోటి పెట్టుబడి పెడితే, వడ్డీగా రూ.6,10,000 లభిస్తుంది. మెచ్యూరిటీ మొత్తం రూ.1,06,10,000 అవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fixed deposits, Sbi, State bank of india