అబ్బాయిలు ఎక్కువ.. అమ్మాయిలు తక్కువ అనే చూసే భామన అందరిలో ఒకప్పుడు ఎక్కువగా ఉండేది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నీ మారుతున్నాయి. లింగ వివక్ష తగ్గిందా? అంటే లేదని అంటోంది చెన్నై సొగసరి సాయిపల్లవి. సమాజంలో లింగ వివక్ష అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే సమానత్వం వైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాం. లింగ వివక్ష కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. అన్నీ చోట్ల ఉందంటూ స్త్రీ, పురుషుల సమానత్వంపై సాయిపల్లవి రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ``హీరోయిన్స్ కూడా సినిమాను ముందు నడిపిస్తారని, తమ భుజ స్కంధాలపై మోస్తారని కొందరు నటీమణులు నిరూపించారు. ఇప్పటి తరంలో చూస్తే నయనతార, అనుష్క వంటి నటీమణుల కారణంగా హీరోయిన్స్‌పై నిర్మాతలకు ఓ నమ్మకం కలిగింది.
ఇప్పుడు విరాటపర్వంలో రానాతో కలిసి నటిస్తున్నాను. సినిమా ఒప్పుకునే ముందు కేవలం సినిమాలో నటించడం వరకే నా బాధ్యత అని అనుకున్నాను. కానీ సినిమా చేసేటప్పుడు రానా ఎంత గొప్ప వ్యక్తో అర్థమైంది. సాధారణంగా హీరోల పేర్లనే పోస్టర్స్‌పై వేయడాన్ని చూశాం. విరాటపర్వంలో నా పాత్రకు న్న ప్రాధాన్యతను బట్టి తన పేరుతో పాటు నా పేరుని కూడా పోస్టర్స్‌పై వేస్తున్నట్లు రానా తెలిపారు. రానా ఆలోచన గొప్పది. తనకి లింగ వివక్షత ఉండదు. అందరినీ సమానంగా చూస్తాడు. తనలాంటి నటుడితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది`` అన్నారు సాయిపల్లవి.
ప్రేమమ్‌తో సినీ రంగ ప్రవేశం చేసిన సాయిపల్లవి, అతి తక్కువ కాలంలోనే ఇటు తెలుగు, అటు తమిళ సినిమాల్లో నటిగా మంచి పేరుని సంపాదించుకుంది. తెలుగులో ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన ఈ బ్యూటీ తర్వాత నానితో ఎంసీఏ సినిమాలోనూ నటించి ఆకట్టుకుంది. వరుస తెలుగు, తమిళ చిత్రాల్లో నటిగా తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది. సినిమాలు, పాత్రల ఎంపికలో చాలా పర్టికులర్‌గా ఉంటున్న సాయిపల్లవి ఇప్పుడు విరాటపర్వంతో పాటు నాని శ్యామ్ సింగరాయ్ సినిమాలోనూ నటిస్తుంది. పవన్‌కల్యాణ్‌తో కలిసి అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమాలో నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Pallavi, Telugu Cinema, Virata Paravam