ఓ వైపు సార్వత్రిక ఎన్నికల వేడి... మరోవైపు కశ్మీర్ ఉగ్రదాడి... దేశమంతా రాజకీయ హడావుడి... వీటితో పాటు దేశం ముందు పలు రంగాలకు సంబంధించి అనేక సవాళ్లు... వీటన్నింటిపై అన్ని వర్గాలు సమగ్రంగా చర్చించి, మేథోమథనం చేసేందుకు న్యూస్18 నెట్‌వర్క్ సమోన్నత వేదికను ఏర్పాటు చేయనుంది. అదే రైజింగ్ ఇండియా సమ్మిట్-2019(Rising India Summit 2019). ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జరగబోయే అతిపెద్ద ఈవెంట్ ఇది. దేశంలోని విభిన్న ప్రాంతాలు, వర్గాలు, రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేదిక ద్వారా తమ గళం వినిపించనున్నారు. సమ్మిట్ మొదటి రోజైన సోమవారం ఆధ్యాత్మికవేత్తలు సద్గురు జగ్గీ వాసుదేవ్, బాబా రాందేవ్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, సురేశ్ ప్రభు, నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.