విజయవాడలో నడిరోడ్డుపై రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ప్రెస్ మీట్

‘మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం’ అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు వర్మ.

news18-telugu
Updated: April 28, 2019, 12:20 PM IST
విజయవాడలో నడిరోడ్డుపై రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ప్రెస్ మీట్
రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్
  • Share this:
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' సినిమా ఇటీవల తెలంగాణలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సంధర్భంగా ఆదివారం రోజున విజయవాడ నోవాటెల్ లో ప్రెస్ మీట్‌ను నిర్వహిస్తున్నట్లు వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ ప్రెస్ మీట్ జరగనున్నట్లు చెప్పారు.

అయితే నోవాటెల్ హోటల్ వారికి ఎవరో బెదిరింపులు పాల్పడటంతో అక్కడ ప్రెస్ మీట్‌ను క్యాన్సిల్ చేశారని వర్మ ట్విట్టర్‌లో తెలిపాడు. ఈ విపరీత పరిస్థితుల్లో ఎంత ట్రై చేసినా అన్ని హోటల్స్, క్లబ్బుల, మేనేజిమెంట్లు, మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారని వర్మ పేర్కొన్నారు. దీంతో నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెడుతున్నా అంటూ వర్మ ట్విటర్ లో పోస్ట్ పెట్టాడు. తాజాగా. దీనికి బదులు...విజయవాడ పైపుల రోడ్డులో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నడిరోడ్డు మీద దీన్ని నిర్వహిస్తానని తన ట్విటర్‌లో ఆయన పేర్కొన్నాడు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈ ప్రెస్‌మీట్ ఉంటుందని తెలిపాడు.

‘మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం’ అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు వర్మ. వర్మ తీసుకున్న తాజా నిర్ణయంతో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ సర్కిల్‌లో ఇప్పటికే పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకున్నారు.

First published: April 28, 2019, 12:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading