ఈ తూగుడు బల్లలకు ప్రపంచమే ఫిదా.. అవార్డులను గెలిచేస్తోంది.. అంత స్పెషల్ ఏంటనుకుంటున్నారా.?

తూగుడు బల్లలపై ఊగుతున్న రెండు దేశాల పిల్లలు

ఓ మూడు గులాబీ రంగు తూగుడు బల్లలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. అవార్డులు కూడా గెలుచుకుంటున్నాయి. అదేంటీ. చిన్న పిల్లలు ఆడుకునే తూగుడు బల్లలకు అవార్డులేంటనే కదా మీ డౌటు.

 • Share this:
  మీరెప్పుడైనా పార్కులకు వెళ్లారా.? అక్కడ చిన్న పిల్లలు చెరోవైపు కూర్చుని ఊగుతూ ఉండే ’తూగుడు బల్లల‘ను చూసే ఉంటారు. అలా ఊగుతూ ఉంటే చిన్న పిల్లలకు ఎంత సరదాగా ఉంటుందో. అప్పుడప్పుడు పెద్దలు కూడా పార్కుల్లో ఉండే తూగుడు బల్లలపై కూర్చుని గాల్లోకి తేలిన సందర్భాలు ఎన్నో ఉంటుంటాయి. ఇప్పుడు అవే తూగుడు బల్లలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రికార్డులను క్రియేట్ చేస్తున్నాయి. అవార్డులు కూడా గెలుచుకుంటున్నాయి. అదేంటీ. చిన్న పిల్లలు ఆడుకునే తూగుడు బల్లలకు అవార్డులేంటనే కదా మీ డౌటు. ఆ తూగుడు బల్లలను పెట్టింది ఎక్కడో కాదు. అమెరికా, మెక్సికో గోడల మధ్య. అలా ఆ రెండు దేశాల మధ్య పెట్టిన గులాబీ రంగు తూగుడు బల్లల వద్ద ఏం జరుగుతోందో చూశాకే అంతా ఆశ్చర్యపోతున్నారు. యూకే సర్కారు అయితే ఏకంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డునే ఇచ్చేసింది.

  అమెరికా, మెక్సికో దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులు ఉండేవో అందరికీ తెలిసిందే. ఒక్క ట్రంప్ హయాంలోనే కాదు, అంతకుముందున్న ఒబామా హయాంలో కూడా మెక్సికో నుంచి అక్రమ వలసలను తగ్గించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ట్రంప్ హయాంలో అయితే ఏకంగా రెండు దేశాల మధ్య గోడ నిర్మాణం కూడా కార్యరూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే 2019వ సంవత్సరం జూలై 28న అమెరికా, మెక్సికో దేశాల మధ్య ఏర్పాటు చేసిన ఇనుప గోడల మధ్యల్లో సడన్ గా మూడు గులాబీ రంగు తూగుడు బల్లలు వెలిశాయి. ఈ తూగుడు బల్లలపై ఇవతలి వైపు అమెరికన్ పిల్లలు, అవతలి వైపు మెక్సికన్ పిల్లలు ఊగుతూ సరదాగా ఆడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే ట్రంప్ సర్కారు పొలిటికల్ వైఖరి రీత్యా అలా ఏర్పాటు చేసిన తూగుడు బల్లలను కేవలం అరగంట వ్యవధిలోనే తీసేయాల్సి వచ్చింది.  అయితే ఆ రెండు దేశాల మధ్య ఏర్పాటు చేసిన తూగుడు బల్లల వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అయింది. ’రాజకీయ నేతల మధ్య విబేధాలు రావచ్చునేమో కానీ చిన్న పిల్లలు మాత్రం ఎప్పుడూ ఐకమత్యంతో ఉంటారు‘ అన్న కామెంట్స్ నెట్టింట వెల్లువెత్తాయి. దీంతో ఈ ప్రాజెక్టు యూకేలో డిజైన్ ఆఫ్ ది ఇయర్ 2020 అవార్డుకు ఎంపికయింది. ప్రపంచ వ్యాప్తంగా 74 ప్రాజెక్టులు ఈ అవార్డు పరిశీలనలోకి రాగా, అమెరికా మెక్సికో దేశాల మధ్య ఏర్పాటయిన ఈ తూగుడు బల్లల ప్రాజెక్టుకు మాత్రం అంతా ఫిదా అయ్యారు. రెండు జాతుల మధ్య సత్సంబంధాలను పెంచే వారథిలా అది కనిపించిందని ఈ సందర్భంగా అవార్డు సభ్యులు వ్యాఖ్యానించారు. కాలిఫోర్నియాకు చెందిన రోనాల్డ్ రాయెల్, వర్జీనియా శాన్ ప్రాటెల్లో సంయుక్తంగా కలెక్టివో చోపెక్ అనే ఆర్టిస్ట్ సహకారంతో ఈ గులాబీ రంగు తూగుడు బల్లల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
  Published by:Hasaan Kandula
  First published: