హోమ్ /వార్తలు /uncategorized /

Breaking: ముఖేష్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపులు.. చంపేస్తామని ఆగంతకుడి ఫోన్ కాల్

Breaking: ముఖేష్ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపులు.. చంపేస్తామని ఆగంతకుడి ఫోన్ కాల్

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ (ఫైల్ ఫోటో)

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ (ఫైల్ ఫోటో)

Mukesh Ambani: ముఖేష్ అంబానీ, నీతా అంబానీలను అంతం చేస్తామని ఆగంతకులు ఫోన్ చేసి బెదిరించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ చైర్మన్ ముఖేష్ అంబానీకి(Mukesh Ambani) మరోసారి బెదిరింపులు వచ్చాయి. రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ నంబర్‌కు గుర్తు తెలియని నంబర్ నుండి బెదిరింపు వచ్చింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీలను అంతం చేస్తామని ఆగంతకులు ఫోన్ చేసి బెదిరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు మధ్యాహ్నం 12.57 గంటలకు సర్కిల్ 2 పరిధిలోని డిబి మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రిలయన్స్ ఫౌండేషన్(Reliance Foundation) హాస్పిటల్ నంబర్‌కు తెలియని నంబర్ నుండి బెదిరింపు కాల్ వచ్చింది. రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని పేల్చివేస్తానని ఆగంతకుడు బెదిరించాడు. దీనిపై డాక్టర్ డిబి మార్గ్ పోలీస్ థానేలో కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం కేసును ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఫోన్‌‌కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఫోన్ కాల్ మహారాష్ట్ర(Maharashtra) బయటి నుంచి వచ్చింది. ఫోన్ కాల్ లొకేషన్‌ను గుర్తించామని పోలీసులు తెలిపారు.

  ఇంతకు ముందు ఆగస్టు 15వ తేదీన కూడా రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు ఇలాంటి కాల్ వచ్చింది. ఆ వ్యక్తి ముఖేష్ అంబానీ ప్రాణాలకు ముప్పు కలిగిస్తూ ఆసుపత్రి డిస్‌ప్లే నంబర్‌కు ఎనిమిది బెదిరింపు కాల్‌లు చేసాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపు కాల్‌కు సంబంధించి ముంబైలోని పశ్చిమ శివారులో నివసిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది ఇదే సమయంలో ముంబైలోని ముఖేష్ అంబానీ నివాసమైన యాంటిలియా వెలుపల అనుమానాస్పద స్కార్పియో నిలబడి కనిపించింది. ఈ అనుమానాస్పద స్కార్పియో గురించి యాంటిలియా భద్రతా బృందం వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, స్నిఫర్ డాగ్‌లతో పోలీసు బృందం వాహనాన్ని తనిఖీ చేసింది. అందులో 20 పేలుడు జిలెటిన్ రాడ్లు, బెదిరింపు లేఖ లభ్యమయ్యాయి.

  గతవారమే ముఖేష్ అంబానీకి సెంట్రల్ ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా వచ్చిన ముప్పు హెచ్చరికలను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఆయనకు జడ్ ప్లస్ యొక్క టాప్ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ముఖేష్ అంబానీకి అంబానీకి మొదటిసారిగా 2013లో చెల్లింపు ప్రాతిపదికన CRPF కమాండోల ‘Z’ కేటగిరీ సెక్యూరిటీని అందించారు. ఆయన భార్య నీతా అంబానీకి కూడా ఇదే విధమైన సాయుధ భద్రత ఉంది. అయితే నీతా అంబానీకి 'Y+' కేటగిరి భద్రత కల్పిస్తున్నారు.

  Gold Silver Rates: భారీ షాక్.. రూ.2,0000 పెరిగిన బంగారం ధర.. జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న గోల్డ్!

  HDFC Loan: 30 నిమిషాల్లో రుణం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అదిరిపోయే శుభవార్త!

  కేంద్ర ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా వ్యాపారవేత్తకు ముప్పు ఉందని గ్రహించిన ఇన్‌పుట్‌లను స్వీకరించిన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ సిఫార్సును అధికారికంగా రూపొందించింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Mukesh Ambani

  ఉత్తమ కథలు