హోమ్ /వార్తలు /uncategorized /

NIC Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 598 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

NIC Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 598 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ పరిధిలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) పరిధిలోని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సైంటిఫిక్, టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ విభాగాల్లో మొత్తం 598 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 4వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించుకోవాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నారు.

ఖాళీల వివరాలు..

S.No.పోస్టుఖాళీలు
1.సైంటిస్ట్-బి:71 పోస్టులు
2.సైంటిఫిక్ ఆఫీసర్/ ఇంజినీర్: 196 పోస్టులు
3.సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్:331 పోస్టులు
మొత్తం: 598

 

విద్యార్హతల వివరాలు:

సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ విద్యార్హతల కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడాల్సి ఉంటుంది.

Constable Posts: అలర్ట్.. 9,212 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్.. వివరాలివే..

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్: https://www.calicut.nielit.in/nic23/

First published:

Tags: JOBS

ఉత్తమ కథలు