Misson Paani : ఇంటింటికి ఇంకుడు గుంత..వాన నీరు వృథాగా పోదింకా...

Misson Paani: ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన వారు ఖచ్చితంగా ఇంకుడు గుంత నిర్మించాలి లేదంటే పర్మిషన్ ఇవ్వమని రూల్స్ తీసుకువచ్చింది.

news18-telugu
Updated: August 24, 2019, 9:48 AM IST
Misson Paani : ఇంటింటికి ఇంకుడు గుంత..వాన నీరు వృథాగా పోదింకా...
ఇంకుడుగుంత
news18-telugu
Updated: August 24, 2019, 9:48 AM IST
నిజామాబాద్ జిల్లాలో వర్షాభావంతో రోజురోజుకి భూగర్భ జలాలు అడుగంటుతున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని అధిగమించి భూగర్భ జలాలు పెంపొందించుకునేందుకు ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నారు.. వర్షపు నీటిని వృథా పోనీయకుండా బొట్టు బొట్టును ఒడిసి పట్టుకుని భూమిలో ఇంకే విధంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఇంకుడు గుంతలను నిర్మించారు.  దీంతో అక్కడ కురిసిన వర్షపు నీరంతా భూమిలో ఇంకిపోతుంది.

ఇంకుడు గుంత


నిజామాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో ఇంటింటికి ఇంకుడు గుంతలు నిర్మించాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన వారు ఖచ్చితంగా ఇంకుడు గుంత నిర్మించాలి లేదంటే పర్మిషన్ ఇవ్వమని రూల్స్ తీసుకువచ్చింది.. దీంతో ఇంటింటా ఇంకుడు గుంతలు ఏర్పాటయ్యాయి.. అయితే నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల సుమారు వంద ఎకరాల్లో విస్తరించి ఉంది.. దీంతో ఈ మైదానంలో కురిసిన వర్షపు నీరు వృథా పోకుండా ఈ మైదానంలో మూడు చోట్ల ఇంకుడు గుంతలను నిర్మించారు.




ఒకటి భవనం పై నుంచి వచ్చే వర్షపు నీరు వృథాగా పోకుండా నిర్మించారు. మరొకటి మైదానంలోని నీరు బయటకు వెళ్లకుండా ప్రహరీ గోడ పక్కన సువిశాలమైన ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు.. మరో పక్కన మరో ఇంకుడు గుంత ఏర్పాటు చేశారు. ఇలా ఈ కళాశాలలో మూడు చోట్ల ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. దీంతో వర్షపు నీరు బొట్టు కూడా వృధా పోకుండా ఇంకుడు గుంతలోకి చేరుతున్నాయి.. ఇంకుడు గుంతల వల్ల కలిగే లాభాలను కళాశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరించారు. దీంతో విద్యార్థులు కూడా వారి వారి ఇళ్లలో ఇలాంటి ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.. నగరం మొత్తం సీసీ రోడ్లు, కాలనీల్లో సైతం సిసి రోడ్లు వేయడంతో వర్షపు నీరు భూమిలో ఇంకిపోయే అవకాశం లేదు.. దీంతో ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు నిర్మించుకొని భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...