హోమ్ /వార్తలు /uncategorized /

Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతం

Jobs in Amazon: ఆ భాషలు తెలిస్తే అమెజాన్‌లో ఉద్యోగం... రూ.40 వేల జీతం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jobs in Amazon | జీతాలు కూడా భారీగానే ప్రకటించింది అమెజాన్. సీనియర్ లెవెల్ పోస్టుకు వార్షిక వేతనం రూ.5 లక్షలు అంతకన్నా ఎక్కువ, జూనియర్ స్థాయి వాళ్లకు వార్షిక వేతనం రూ.2.6 లక్షల నుంచి రూ.3.6 లక్షల వరకు ఆఫర్ చేస్తోంది ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్.

ఇంకా చదవండి ...

  అమెజాన్‌లో 'డిజిటల్ కంటెంట్ అసోసియేట్' పోస్టు నిరుద్యోగులను ఊరిస్తోంది. మీకు జపనీస్, జర్మన్ భాషలు తెలిసినట్టైతే అమెజాన్‌‌లో ఉద్యోగం దొరకడం సులువే. ఎందుకంటే ఇటీవల చెన్నైలోని హయకవ జపనీస్ లాంగ్వేజ్ స్కూల్ బయట “Walk-in for Amazon” పోస్టర్ కనిపించింది. అంతేకాదు న్యూ ఢిల్లీలోని జర్మన్ లాంగ్వేజ్ ఇన్‌స్టిట్యూట్ అయిన మ్యాక్స్ ముల్లర్ భవన్‌లో కూడా ఇలాంటి పోస్టర్లే కనిపించాయి. ఇవి మాత్రమే కాదు... జపనీస్, జర్మన్ భాషలు నేర్పించే ఇన్‌‌స్టిట్యూట్స్‌లో 'డిజిటల్ కంటెంట్ అసోసియేట్' పోస్టుల ఇంటర్వ్యూకు హాజరు కావాలంటూ పిలుస్తోంది అమెజాన్.


  Read this: Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు


  గతంలో యూనివర్సిటీలు, ప్రొఫెషనల్ కాలేజీల్లో టాలెంట్ కోసం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించేవాళ్లు. ఇప్పుడు ఫారిన్ లాంగ్వేజీ విద్యార్థులను నియమించుకునేందుకు ఇలా లాంగ్వేజ్ ఇన్‌స్టిట్యూట్లపై కన్నేశాయి అమెజాన్‌ లాంటి బడా కంపెనీలు. అడ్వాన్స్ జపనీస్ లెవెల్(JLPT N3/N2) కోర్సులు పూర్తి చేసిన జపనీస్ లాంగ్వేజ్ విద్యార్థుల కోసం హయకవ జపనీస్ లాంగ్వేజ్ స్కూల్‌లో రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించింది అమెజాన్. జీతాలు కూడా భారీగానే ప్రకటించింది. సీనియర్ లెవెల్ పోస్టుకు వార్షిక వేతనం రూ.5 లక్షలు అంతకన్నా ఎక్కువ, జూనియర్ స్థాయి వాళ్లకు వార్షిక వేతనం రూ.2.6 లక్షల నుంచి రూ.3.6 లక్షల వరకు ఆఫర్ చేస్తోంది ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్.


  Read this: Good News: ప్యాకేజీల ధరలు తగ్గిస్తున్న డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై


  Jobs in Amazon, Amazon jobs, career in Amazon, openings in Amazon, amazon jobs in hyderabad for freshers, part time jobs in amazon, amazon careers, amazon seller support jobs, amazon bpo jobs in hyderabad, అమెజాన్‌లో ఉద్యోగాలు, అమెజాన్ జాబ్స్, అమెజాన్ కెరీర్, అమెజాన్ ఇంటర్వ్యూ, అమెజాన్ కాల్ సెంటర్


  నాలుగు నెలల క్రితం చెన్నైలోని జపనీస్ లాంగ్వేజ్ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో 40 మందిని ఇంటర్వ్యూ చేస్తే ఆరుగురు సెలెక్ట్ అయ్యారు. జపనీస్ ఉత్పత్తులకు సంబంధించిన అక్షర దోషాలు గుర్తించడం వీరి పని. ఇందుకోసం బేసిక్ జపనీస్ లాంగ్వేజ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. రెండోసారి నిర్వహించిన డ్రైవ్‌లో జపనీస్ మాట్లాడటం, చదవడం, రాయడం తెలిసినవారిని తీసుకున్నారు. ప్రూఫ్ రీడింగ్ కోసం వీరిని నియమించుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో 45 ఏళ్ల గృహిణి గాయత్రీ రాఘవన్ సెలెక్ట్ కావడం విశేషం. ఏడేళ్ల క్రితం వరకు స్కూల్ టీచర్‌గా పనిచేసిన గాయత్రీకి ఇద్దరు పిల్లలు. సరదాగా జపనీస్ భాష నేర్చుకుంటే అమెజాన్‌లో ఉద్యోగం దొరికడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు.


  నేను ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతానని అస్సలు నమ్మలేకపోయాను. నాకు 42 ఏళ్లు ఉన్నప్పుడు నేను కేవలం హాబీ కోసం జపనీస్ భాష నేర్చుకోవడం మొదలుపెట్టాను. అమెజాన్ లాంటి కంపెనీలో ఉద్యోగం దొరుకుతుందని నేను అస్సలు ఊహించలేదు.

  గాయత్రీ రాఘవన్, అమెజాన్‌కు సెలెక్ట్ అయిన మహిళ


  Jobs in Amazon, Amazon jobs, career in Amazon, openings in Amazon, amazon jobs in hyderabad for freshers, part time jobs in amazon, amazon careers, amazon seller support jobs, amazon bpo jobs in hyderabad, అమెజాన్‌లో ఉద్యోగాలు, అమెజాన్ జాబ్స్, అమెజాన్ కెరీర్, అమెజాన్ ఇంటర్వ్యూ, అమెజాన్ కాల్ సెంటర్


  జపనీస్ మాత్రమే కాదు జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలు తెలిసినవారికి అమెజాన్‌లో మంచి డిమాండ్ ఉంది. లింక్డ్‌ఇన్‌ లాంటి జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్స్‌పై అమెజాన్ జాబ్ ఆఫర్స్ కనిపిస్తాయి. గతంలో ఫారిన్ లాంగ్వేజ్ ప్రొఫెషనల్స్‌కి ట్రాన్స్‌లేషన్, ఇంటర్‌ప్రిటేషన్ లాంటి ఉద్యోగావకాశాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ కంపెనీలు కూడా విదేశీ భాషలు తెలిసినవారిని నియమించుకుంటున్నాయి. ఫారిన్ భాషలు తెలిసిన విద్యార్థులకు డిమాండ్ పెరిగినట్టుగానే ఫారిన్ లాంగ్వేజ్ కోర్సులకూ డిమాండ్ పెరుగుతోంది. సో... మీకు ఏదైనా విదేశీ భాష తెలుసా? ఇప్పుడిప్పుడే ఫారిన్ లాంగ్వేజీ నేర్చుకుంటున్నారా? ఓసారి అమెజాన్‌లో ఖాళీలపై దృష్టిపెట్టండి.


  Photos: కాలుష్యం కనిపిస్తే ఇలాగే ఉంటుంది... కళాకారుల ఊహాత్మక చిత్రాలు  ఇవి కూడా చదవండి:


  IRCTC Discount: టికెట్ బుకింగ్‌లో వృద్ధులకు మినహాయింపు... నిబంధనలు ఇవే


  Good News: ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచే అవకాశం... పీఎఫ్ వడ్డీ రేటు యథాతథం


  PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

  First published:

  Tags: Amazon, AMAZON INDIA, CAREER, JOBS

  ఉత్తమ కథలు