హైడ్రోజన్ మంత్రం... త్వరలో కాలుష్య రహితంగా జపాన్...

Japan : ఈ ప్రపంచంలో సమయాన్ని పాటిస్తూ... హార్డ్ వర్క్ చేసేవాళ్లుగా గుర్తింపు పొందిన జపనీయులు... మరో మంచి పని చేసేందుకు సిద్ధమయ్యారు. తమ దేశాన్ని కాలుష్య రహితంగా చేసుకునేందుకు నడుం బిగించారు.

Krishna Kumar N | news18-telugu
Updated: September 21, 2019, 8:51 AM IST
హైడ్రోజన్ మంత్రం... త్వరలో కాలుష్య రహితంగా జపాన్...
హైడ్రోజన్ మంత్రం... త్వరలో కాలుష్య రహితంగా జపాన్...
  • Share this:
సూర్యుడు ముందుగా ఉదయించే దేశంగా గుర్తింపు పొందిన జపాన్... అదే సూర్యుణ్ని ఉపయోగించుకొని... కాలుష్య రహితంగా మారేందుకు భారీ ప్లాన్ రెడీ చేసుకుంది. FH2R పేరుతో ఓ భారీ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మిస్తోంది. దాని ద్వారా 2020 నుంచీ 900 టన్నుల హైడ్రోజన్‌ను ఉత్పత్తి చెయ్యబోతోంది. ఈ రోజుల్లో హైడ్రోజన్ అనేది... సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా మారింది. ఎందుకంటే... ఇది కార్బన్ డై ఆక్సైడ్‌ను ఉత్పత్తి చెయ్యదు. హైడ్రోజన్ వల్ల కాలుష్యం ఏర్పడదు. జపాన్... FH2R ప్లాంట్‌తోపాటూ... ఫుక్‌షిమా అణువిద్యుత్ కేంద్రంలో హైడ్రోజన్ ఇంధనాన్ని తయారుచేసే టార్గెట్ పెట్టుకుంది. 2040 నాటికి జపాన్‌లో వాహనాలన్నీ వంద శాతం హైడ్రోజన్‌ ద్వారానే నడవాలన్నది ఆ దేశం కొత్తగా పెట్టుకున్న లక్ష్యం. అందుకు కావాల్సినంత హైడ్రోజన్ ఎనర్జీని ఫుక్ షిమా ప్లాంట్ తయారుచేయబోతోంది.

ఫుక్‌షిమా ప్లాంట్‌లో తయారయ్యే హైడ్రోజన్ ఇంధనం ఫ్యూయల్ సెల్ వెహికిల్స్, ఇళ్లు, ప్లాంట్లు, పరిశ్రమలకు సరఫరా అవుతుంది. అందుకు తగ్గట్లుగా... జపాన్‌లో బస్సులు, కార్లు అన్నీ ఫ్యూయల్ సెల్ సిస్టంతో రానున్నాయి. ఫ్యూయల్ సెల్ వెహికిల్స్... హైడ్రోజన్ ఇంధనంతో నడుస్తాయి. అందువల్ల జపాన్ పూర్తిగా గ్రీన్ హౌస్ వాయువుల సమస్య నుంచీ బయటపడుతుంది. కాలుష్యం అన్నదే లేకుండా పోతుంది. 2040 నుంచీ మనం సరికొత్త జపాన్‌ని చూస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది.

మన ఇండియా కూడా ఇలాంటి చర్యలు ఆల్రెడీ మొదలుపెట్టింది. ప్రపంచంలో అతి పెద్ద సోలార్ ప్లాంట్లు ఉన్నది ఇండియాలోనే. ఐతే... ఇండియాతో పోల్చితే... జపాన్ మన తెలుగు రాష్ట్రాల కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది. అందువల్ల ఆ దేశం ఏ నిర్ణయం తీసుకున్నా... వెంటనే అమలు చేసేందుకూ వీలవుతోంది. మన ఇండియా చాలా పెద్దది కాబట్టి... కొత్త నిర్ణయాలు తీసుకోవడానికీ, అమలవ్వడానికీ టైమ్ పడుతోంది. జపాన్ తన టార్గెట్ చేరుకుంటే... మిగతా ప్రపంచ దేశాలు కూడా అటువైపు అడుగులు వేసే ఛాన్సుంది.

First published: September 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>