Jabardasth Apparao: ఆ విషయంలో జగన్ సర్కారుకు జై కొట్టిన జబర్ధస్త్ అప్పారావు.. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) సర్కారు.. మూడు రాజధాను(3 Capitals)ల విషయంలో పట్టుదలతో ఉంది. దీనికి మద్ధతుగా ఈ నెల 15న (శనివారం) విశాఖ గర్జనకు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన వైసీపీ మద్ధుతు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. విశాఖను పరిపాలన రాజధాని కోసం ఇక్కడి కళాకారుడిగా విశాఖ గర్జనకు సపోర్ట్ చేస్తున్నట్టు ఓ వీడియో విడుదల చేసారు. ఈ గర్జన సక్సెస్ కావాలని అభిలషించారు. మన విశాఖను రాజధానికి మార్చే క్రమంలో అందరం రేపు జరగబోయే విశాఖ గర్జనకు మద్దతు తెలిపారని పిలుపునిచ్చాడు.
విశాఖను పరిపాలన రాజధాని చేయాలని కోరుతున్నానని.. ఈ మహా కార్యంలో పాల్గొనే వారికి మద్దతు ఇచ్చే వారికి తన ధన్యవాదాలు తెలిపారు. జబర్ధస్త్ అప్పారావు నిర్ణయాన్ని వైసీపీ కార్యకర్తలు అభిమానులు స్వాగతిస్తున్నారు. ఇక మూడు రాజధానుల విషయంలో వ్యతిరేకత ప్రదర్శిస్తున్న వారు మాత్రం జబర్ధస్త్ అప్పారావును సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు. జబర్దస్త్ నటుడిగా కామెడీ వేషాలు వేసుకోక నీకీ గోల ఎందుకు అని ఇంకొందరు అప్పారావుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈయన విశాఖ గర్జనకు మద్ధతు ఇస్తున్న వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఈ నెల 15న విశాఖ గర్జనలో అందరూ పాల్గొనాలని కోరుతున్న జబర్దస్త్ / సినీ నటుడు అప్పారావు#ISupport3Capitals #VisakaGarjana pic.twitter.com/eAFEg2kVNy
— KR Chowdary Yarlagadda (@KRChowdaryy) October 13, 2022
జబర్దస్త్ కమెడియన్ అప్పారావు స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖ పట్నం జిల్లాలోని అక్కాయపాలెం. ఆయన సతీమణి టీజర్‌గా పనిచేస్తున్నారు. ఈయన ఇప్పటి వరకు 250కి పైగా సినిమాలు.. 70 పైగా సీరియల్స్‌లో యాక్ట్ చేశారు. చిన్నప్పటి నుంచే నాటకాల పై ఆసక్తితో నటుడయ్యారు. ఈయన ‘శుభవేళ’ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఈటీవీలో ప్రసారమయ్యే జబర్ధస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యారు. ఆయన సొంతఊరు విశాఖ పట్నం కావడంతో ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయానికి జై కొట్టారు. అప్పట్లో కరోనా సమయంలో ఈయన కరోనాపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దానికి సంబంధించిన వీడియో అప్పట్లో వైరల్ కూడా అయ్యాయి.
జబర్దస్త్ పుణ్యమా అని బాగానే సంపాదించుకుంటున్నామని.. పేరు కూడా బాగానే వచ్చిందని అప్పారావు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కామెడీ షో మాత్రమే కాకుండా ఈవెంట్స్ కూడా వస్తుంటాయని.. వాటిని బట్టి రేట్ కూడా ఉంటుందని చెప్పాడు అప్పారావు.20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా కూడా రాని గుర్తింపు జబర్దస్త్ తీసుకొచ్చింది ఈయనకు. తాజాగా ఈయన మూడు రాజధానులకు జై కొట్టడం ఇపుడు రాజకీయ వర్గాల్లోహాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.