Ind vs Eng: భారత్, ఇంగ్లండ్‌ తొలి టెస్టు.. మ్యాచ్ ఎక్కడ చూడోచ్చు.. వేదిక, సమగ్ర వివరాలు !

India vs England

సుదీర్ఝ విరామం తర్వాత భారత గడ్డపై అంతర్జాతీయ క్రీడా సంబరం మెుదలు కాబోతుంది. ఇండియాలో కరోనా విజృంభణ కారణంగా క్రికెట్ అభిమానులు అమితంగా ఇష్టపడే ఐపీఎల్ యుఏఈ వేదికగా జరిగింది.

  • Share this:


    ఆటకు అంతా సిద్దమైంది. సుదీర్ఝ విరామం తర్వాత భారత గడ్డపై అంతర్జాతీయ క్రీడా సంబరం మెుదలు కాబోతుంది. ఇండియాలో కరోనా విజృంభణ కారణంగా క్రికెట్ అభిమానులు అమితంగా ఇష్టపడే ఐపీఎల్ యుఏఈ వేదికగా జరిగింది. ఆ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. దాదాపు ఏడాది విరామం తర్వాత భారత్‌లో క్రికెట్  షురూ అవుతోంది. శుక్రవారం చెన్నై వేదికగా భారత్,ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లను నేరుగా చూసే అవకాశం ప్రేక్షకులకు లేకుండా పోయింది.  ఈ ఇరు జట్ల సమారాన్ని  టీవీల్లోనే చూడాలి.  రెండో టెస్టు నుంచి పరిమిత సంఖ్యలో అబిమానులను  మైదానంలోకి అనుమతి ఇస్తారు.

    మ్యాచ్ ప్రారంభం: ఉదయం 9.30 గం II

    వేదిక: చెపాక్‌ మైదానం

    ఎక్కడ చూడోచ్చు:  స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

    భారత జట్లు (అంచనా): భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, శుబ్‌మన్, పుజారా, రహానే, పంత్, అశ్విన్, అక్షర్, కుల్దీప్‌(or)సిరాజ్, ఇషాంత్, బుమ్రా.

    ఇంగ్లండ్‌: రూట్‌ (కెప్టెన్‌), సిబ్లీ, బర్న్స్, స్టోక్స్, ఓలీ పోప్, బట్లర్, మొయిన్‌ అలీ, వోక్స్, ఆర్చర్, లీచ్, స్టువర్డ్‌ బ్రాడ్

    ఇక స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగబోయే ఈ మూడు ఫార్మాట్ల సిరీస్‌ కోసం భారత జట్టు సన్నద్దమవుతుంది. ఆసీస్ సిరీస్‌లో పూర్తి స్థాయిలో కొనసాగని ఆటగాళ్ళు ఈ సిరీస్ మెుత్తం కొనసాగునున్నారు. పితృత్వ సెలవుపై మెుదటి టెస్ట్ తర్వాత స్వదేశానికి వచ్చిన కోహ్లి సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఇక ఇషాంత్ శర్మ, హార్దిక్ పాండ్యా కూడా తిరిగి జట్టుతో కలవనున్నారు. అలాగే ఈ సిరీస్‌లో భాగంగా ఇటివలే రెండు టెస్ట్ మ్యాచ్‌ల కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ టీంలో యువ క్రికెటర్లు రిషభ్‌ పంత్‌, శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ చోటు దక్కించుకున్నారు.

    ఫిబ్రవరి 5 నుంచి ఈ సిరీస్ మెుదలుకానుంది. ఇక సిరీస్‌ పూర్తి షెడ్యూల్‌ను ఓ సారి చూస్తే..

    4 టెస్ట్ మ్యాచ్‌లు ఫిబ్రవరి 5 - మార్చి 8

    మెుదటి టెస్టు: ఫిబ్రవరి 5-9, వేదిక: చెన్నై మ్యాచ్ సమయం: ఉదయం 9:30 నిమిషాలు

    రెండో టెస్టు: ఫిబ్రవరి 13-17, వేదిక: చెన్నై మ్యాచ్ సమయం: ఉదయం 9.30 ని II

    మూడో టెస్టు: ఫిబ్రవరి 24-28, వేదిక: అహ్మదాబాద్‌ సమయం: మధ్యాహ్నం 2.30 ని (డే/నైట్‌) II

    నాలుగో టెస్టు: మార్చి 4-8, వేదిక: అహ్మదాబాద్‌ సమయం: ఉదయం 9.30 నిమిషాలు

    ఐదు టీ20 మ్యాచ్‌లు

    భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య అహ్మదాబాద్‌ మొతేరా స్టేడియం వేదికగా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరగనున్నాయి.

    మ్యాచ్ సమయం: రాత్రి 7 గంటలతొలి టీ20: మార్చి 12

    రెండో టీ20: మార్చి 14

    మూడో టీ20: మార్చి 16

    నాలుగో టీ20: మార్చి 18

    ఐదో టీ20: మార్చి 20

    మూడు వన్డేలు

    మూడు వన్డేల సిరీస్‌కు పుణె వేదిక జరగనుంది

    సమయం: మధ్యాహ్నం 1.30 ని II

    తొలి వన్డే: మార్చి 23

    రెండో వన్డే: మార్చి 26

    మూడో వన్డే: మార్చి 28
    Published by:Rekulapally Saichand
    First published: