పిజ్జా, బర్గర్‌ను డామినేట్ చేయనున్న ఇడ్లీ, దోశ..!

ప్రపచంలోనే అత్యంత పురాతన సంస్కృతిని భారత్ కలిగి ఉందని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. భారతదేశం.. రోమన్, ఈజిప్షియన్, గ్రీకు వంటి నాగరికతల సమాహారమని ఆయన అన్నారు.

news18-telugu
Updated: September 29, 2018, 5:00 PM IST
పిజ్జా, బర్గర్‌ను డామినేట్ చేయనున్న ఇడ్లీ, దోశ..!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
యూత్‌లో పిజ్జా, బర్గర్‌ వంటి జంక్ ఫుడ్‌కు ఉన్న క్రేజే వేరు..! ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పిజ్జా, బర్గర్లకు భలే డిమాండ్ ఉంది. ఐతే భవిష్యత్ వాటి స్థానాలను భారతీయ వంటకాలు భర్తీ చేస్తాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయడ్డారు. గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో జరిగిన ఓ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత నాగకరికత, భారతీయ వంటకాల గురించి మాట్లాడారు.

భారతీయుల ఆహారపు అలవాట్లు అంతర్జాతీయంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మన వంటకాలైన ఇడ్లీ, దోశ భవిష్యత్‌లో అంతర్జాతీయ ఆహారం కానున్నాయి. వీటి ముందు పిజ్జా, బర్గర్‌లు నిలవలేవు. దశల వారిగీ ఇడ్లీ, సాంబార్‌, దోశలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పిజ్జా, బర్గర్‌ స్థానాలను భర్తీ చేయనున్నాయి. గోవా చేపల కూర రుచి మాటల్లో వర్ణించలేనిది. దానికి మరేది సాటిరాదు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.
వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి


ప్రపచంలోనే అత్యంత పురాతన సంస్కృతిని భారత్ కలిగి ఉందని వెంకయ్యనాయుడు ప్రశంసించారు. భారతదేశం.. రోమన్, ఈజిప్షియన్, గ్రీకు వంటి నాగరికతల సమాహారమని ఆయన అన్నారు. అందుకే భారత దేశాన్ని వసుదైక కుటుంబంగా వర్ణిస్తారని చెప్పారు.
Published by: Shiva Kumar Addula
First published: September 29, 2018, 5:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading