Home /News /uncategorized /

I T SLEUTHS UNEARTH RS 109 CR CASH 25 KG GOLD FROM KANNADA ACTORS PRODUCERS AFTER 3 DAYS OF RAIDS

ఐటీ దాడుల్లో రూ.109 కోట్ల అక్రమాస్తులు, 25 కేజీల బంగారం సీజ్

కన్నడ స్టార్స్ ఇళ్లలో ఐటీ సోదాలు

కన్నడ స్టార్స్ ఇళ్లలో ఐటీ సోదాలు

కన్నడ సినీ తారలు, నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో వరుసగా మూడు రోజులు సోదాలు జరిపిన ఐటీ శాఖ అధికారులు..రూ.109 కోట్ల విలువైన అక్రమాస్తులు, 25 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

  కన్నడ సినీ తారలు, నిర్మాతల ఇళ్లపై జరిపిన ఐటీ దాడుల్లో భారీగా అక్రమ సొమ్ము పట్టుబడింది. వరుసగా మూడు రోజులు పాటు జరిగిన సోదాల్లో ఏకంగా రూ.109 కోట్ల విలువైన అక్రమ ఆస్తులు, 25 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కర్ణాటక-గోవా ప్రాంతీయ ఐటీ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. పన్ను ఎగవేతకు సంబంధించిన పక్కా ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. ఈ నెల 3 తేదీ నుంచి శనివారం వరకు మూడు రోజుల పాటు పలువురు కన్నడ సినీ తారలు, నిర్మాతల ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కన్నడ నటులు శివ రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, యష్, నిర్మాతలు రాక్‌లైన్ వెంకటేశ్, సీఆర్ మనోహర్, జయన్న తదితరుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.

  ప్రతీకాత్మక చిత్రం


  180 కార్యాలయాలు, 21 ప్రాంతాల్లో గత మూడు రోజులుగా సోదాలు నిర్వహించినట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. సోదాల్లో నటులు, నిర్మాతల అక్రమ నగదు, అక్రమ పెట్టుబడులు, బంగారు ఆభరణాలకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సినిమాల ఆడియో రైట్స్ విక్రయాలు, డిజిటల్, శాటిలైట్ రైట్స్ విక్రయాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సినీ నిర్మాతలు దాచిపెట్టి, పన్ను ఎగ్గొడుతున్నట్లు పక్కా ఆధారాలు సేకరించినట్లు తెలిపారు. అయితే కన్నడ సినీ తారలు, నిర్మాతలు ఎవరెవరి ఇంట్లో నుంచి ఎంతెంత అక్రమ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారో ఐటీ శాఖ అధికారులు వెల్లడించలేదు.

  ఇది కూడా చదవండి

  కన్నడ సినీ తారల ఇళ్లపై ఐటీ దాడులు...కరెక్టే అన్న కుమారస్వామి
  First published:

  Tags: Kannada Cinema, Karnataka

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు