ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తాజాగా మరో భారీ సేల్ ను ప్రారంభించింది. ఈ నెల 7 నుంచి 11 వ తేదీ వరకు గ్రాండ్ హోం సేల్ లో వివిధ హోం అప్లియెన్స్ పై భారీ ఆఫర్లను ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ఈ సేల్ లో 75 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. ముఖ్యంగా ఏసీలపై ఏకంగా 55 శాతం డిస్కౌంట్ ఉంటుందని వెల్లడించింది. ఇంకా మైక్రోవేవ్స్ పై 45 శాతం డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది. స్మార్ట్ టీవీలపై మంచి ఆఫర్లు ఈ సేల్ లో ఉన్నాయి. రూ.7199 ప్రారంభ ధరతో వినియోగదారులు సేల్ లో టీవీలను కొనుగోలు చేయవచ్చు.
Kent ACE 8L వాటర్ ప్యూరిఫైయర్ ను రూ.10,999కే ఈ సేల్ లో సొంతం చేసుకోవచ్చు. సాంసంగ్ 192 L రిఫ్రిజిరేటర్ ను రూ.13,190కి కొనుగోలు చేయవచ్చు. IFB 6 KG ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ ను కేవలం రూ.22,490కే సొంతం చేసుకోవచ్చు.
హెవెల్స్ 10L వాటర్ గీజర్ ను కేవలం రూ.5999 కే కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ తన సేల్స్ పేజీలో పేర్కొంది. రూ.199 ప్రారంభ ధరతో ఫ్యాన్లు తదితర వస్తువులను కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఇంకా రూ.499 ప్రారంభ ధరతో ఐరన్ బాక్స్ లను కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Offers, Smartphones