'నీతోడు కావాలి’ అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు 14 ఏళ్ల వయసులో పరిచయం అయిన హీరోయిన్ ఛార్మి..ఆ తర్వాత ‘శ్రీ ఆంజనేయం’ సినిమాలో ఈ అమ్మడు తడి అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత ‘గౌరీ’, ‘మంత్ర’ లాంటి సినిమాలతో తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ ఆమె ఖాతాలో బ్లాక్ బస్టర్ హిట్ చేరలేదు. ఆ తరువాత ఐటమ్ సాంగ్స చేసిన కెరీర్ను మలుపు తిప్పుకునే ప్రయత్నం చేసినా ఛార్మి కెరియర్ గాడిన పడలేదు. అయితే అప్పట్లో తన అందాలతో యువతను తనవైపు తిప్పుకున్న ఛార్మి ప్రస్తుతం నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.

పూరీ జగన్నాథ్, నిధి అగర్వాల్, రామ్, ఛార్మి (Image:Charmme Kaur/Instagram)
తన ప్రొడక్షన్ సంస్థలో నటిస్తున్నహీరోయిన్లకు కూడా తన దైన స్టయిల్లో గ్లామర్ టచ్ ఇస్తోందట ఛార్మి . ఇంతకు ముందు కొంచెం సాంప్రదాయం గా కనిపించిన భామలు ఛార్మి చేతుల్లో పడ్డాక సూపర్ హాట్ గా మారిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది . ఇందుకు "ఇస్మార్ట్ శంకర్" లో రామ్ తో జోడీగా చిందేసిన నిధి అగర్వాల్, నభా నటేష్ ఇందుకు మంచి ఉదాహరణ. నిధి ఇంతకు ముందు తెలుగులో చేసిన ‘సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్న’ సినిమాల్లో చాలా ట్రెడిషినల్ అమ్మాయిగా కనిపించింది. గ్లామర్ షో చేయలేదు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ లో ఆమె చేసిన స్కిన్ షో ప్రేక్షకులకు హీట్ పుట్టించింది.

ఇస్మార్ట్ శంకర్లో నిధి అగర్వాల్ (Twitter/Photo)
ఈ సినిమాలో క్లీవేజ్-షోలు, లిప్-లాక్స్ తో యువతను మత్తెక్కించి చెలరేగి పోయింది. బాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాల్లో కూడా ఇంత అందాల ఆరబోత లేదనుకుంటున్నారు.ఇక ‘నన్ను దోచుకుందువటే’ లో చాలా ట్రెడిషనల్ గా కనిపించిన నభా నటేష్ సైతం ‘ఇస్మార్ట్ శంకర్’ కు వచ్చి తన అందాల గేట్లు తెరిచేసి, లిమిట్ లేని స్కిన్ షో తో గ్లామర్ డాల్ అయిపోయి అందాల విందు చేసింది. ఈ స్టైల్ లో యువత కోసం కావలసినంత గ్లామర్ టచ్ ప్లాన్ చేసింది ఛార్మి అనే చెప్పుకుంటున్నారు.

నభా నటేష్ హాట్ ఫోటోషూట్ (Source: Twitter)
సినిమా మేకింగ్ లో అంతా తానై వ్యవహరిస్తున్న ఛార్మి హీరోయిన్ల స్టైల్, లుక్ మార్చేసి హీరోయిన్ల లక్ ను కూడా పర్యవేక్షి స్తోందట . ఆమె సూచనలు ఆదేశాల మేరకే హీరోయిన్లను ఇంత ఎక్స్పోజింగ్ తో సెక్సీయస్ట్ గా తయారు చేస్తున్నారట.
Published by:Kiran Kumar Thanjavur
First published:September 28, 2019, 14:26 IST