GvL on Chandrababu: అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు (BJP MP GVL Narsimha Ra).వైసీపీ ప్రభుత్వం (YCP Govrnment) చేతకానితనం కారణంగానే పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పూర్తి కాలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఏపీని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఇప్పటికే భారీగా నిధులు ఇచ్చిందని.. ఇస్తూనే ఉంది అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఇది కేవలం చేతకాని తనమేనంటూ ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధి కేంద్రం సహకారంతోనే ముడిపడి ఉందనే విషయాన్ని ఎంపీ గుర్తు చేశారు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఇదికూడా చేతకాని తనమేనని విమర్శించారు. ఒకవేళ తన వ్యాఖ్యలు నిజం కాదని వైసీపీ నేతలు భావిస్తే.. సీఎం జగన్ ప్రభుత్వం తనతో చర్చించటానికి రావాలి అంటూ సవాల్ విసిరారు. కేవలం విశాఖలో కబ్జాలు చేయటానికే రాజధాని అంటున్నారంటూ జీవీఎల్ ఈ సందర్భంగా ఆరోపించారు.
విశాఖలో భూకబ్జాలపై వైసీపీ ప్రభుత్వం చర్చకు వస్తుందా అంటూ మరో ఛాలెంజ్ చేశారు. సిట్ రిపోర్టును వైసీపీ ఎందుకు బయట పెట్టటంలేదంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే స్టార్టప్ కంపెనీలకు సహాకారం అందించటం కూడా వైసీపీ ప్రభుత్వానికి చేతకాలేదని ఆవేద వ్యక్తం చేశారు. ఇలాంటి అలసత్వంతో ఏపీలో అనేక ప్రాజెక్టులు నిర్వీర్యమైపోతున్నాయి అంటూ జీవిఎల్ ఈ సందర్భంగా వెల్లడించారు.
గతంలో కూడా జీవీఎల్ వైసీపీ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే కార్యాలయాలు నెలకొల్పుతామని కేంద్ర సంస్థలు లేఖలు రాస్తున్నా.. పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. అమరావతిలో అక్రమాలంటూ మూడేళ్లుగా ఆరోపణలు చేస్తున్నారే తప్ప.. ఒక్క ఆధారమైన బయటపెట్టారా? అంటూ జీవీఎల్ నిలదీశారు. మూడు రాజధానులు సాధ్యం కాదని వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్కు తెలుసన్నారు.. అయినా మూడేళ్ల క్రితం వేసిన క్యాసెట్టే మళ్లీ వేస్తున్నారని జీవీఎల్ నర్సింహారావు ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి : పవన్ నడిపిన లగ్జరీ బైక్ చూశారా.. ఖరీదు ఎంతంటే..?
అలాగే రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టులు, విశాఖ భూ కబ్జాల పై బహిరంగ చర్చకు సిద్ధమా… అంటూ వైసీపీ,టీడీపీలకు ఎంపి జీవీఎల్ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. పోలవరం కోసం కేంద్రం నిధులిస్తే ప్రాజెక్ట్ ప్రారంభించిన చంద్రబాబు కమిషన్ల కోసం దానినితీసుకున్నారు.. గత 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా వుండి రాష్ట్రంలో ఎందుకు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు రాలేదని చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. విశాఖ భూ దోపిడీలో టీడీపీ , వైసీపీ తోడు దొంగలే అని ఆరోపించారు. రెండు సిట్ లు ఏర్పాటు చేసిన ఎందుకు నివేదికలు బయటపెట్టలేదన్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు కు చంద్రబాబు కు రహస్య ఒప్పందం ఉందని.. ఆ లాలూచీ ఎంటో బయటపెట్టాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap bjp, Ap cm jagan, AP News, GVL Narasimha Rao